Natti Kumar: ఏపీలో నైట్ కర్య్ఫూపై ఆసక్తికర కామెంట్స్ చేసిన ప్రొడ్యూసర్ నట్టికుమార్.. టాలీవుడ్‏కు నష్టమంటూ..

దేశంలో కరోనా మరోసారి విజృంబిస్తుంది. గత కొద్ది రోజులుగా కోవిడ్, ఓమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో

Natti Kumar: ఏపీలో నైట్ కర్య్ఫూపై ఆసక్తికర కామెంట్స్ చేసిన ప్రొడ్యూసర్ నట్టికుమార్.. టాలీవుడ్‏కు నష్టమంటూ..
Nattikumar
Follow us

|

Updated on: Jan 11, 2022 | 7:58 AM

దేశంలో కరోనా మరోసారి విజృంబిస్తుంది. గత కొద్ది రోజులుగా కోవిడ్, ఓమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయ రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ , లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్య్ఫూ విధించింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ వలన చిత్రపరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతుందని.. కానీ ప్రజల శ్రేయస్సు కారణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్దించాల్సిందే అని అన్నారు నట్టికుమార్.

అలాగే సినిమాలకు సంక్రాంతి సీజన్ చాలా కీలకమైందని… పెద్ద పండుగ కావడం వలన చిన్నా, పెద్ద సినిమాలను హిట్ కావాలని కోరుకుంటారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే పెద్ద చిత్రాలు వాయిదా పడ్డాయని.. ఇక ఇప్పుడు చిన్న సినిమాలపై నైట్ కర్ఫ్యూ, 50 ఆక్యూపెన్సీ తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నారు. కానీ ఈ పరిస్థితులలో ప్రజల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదని.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టడానికి లేదని ఆయన అన్నారు. అలాగే టికెట్స్ రేట్ల పై స్పందిస్తూ.. ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్ట్ వచ్చే వరకూ ఎవరు ఏమి చేయలేరని అన్నారు. మరోవైపు మంత్రి పేర్ని నానితో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సమావేశంపైనా నట్టికుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Also Read: Akhanda Movie: జై బాల‌య్య ఫుల్ సాంగ్ వ‌చ్చేసింది చూశారా.. రికార్డు వ్యూస్‌తో హ‌ల్చ‌ల్‌..

Rakul Preet Singh: ప్రేమలో మునిగి తేలుతున్న అందాల ముద్దుగుమ్మ.. క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్..

Balakrishna: మంత్రి హ‌రీష్ రావును క‌లిసిన బాల‌కృష్ణ‌.. ఏ అంశాల‌పై చ‌ర్చించారంటే..