Sri Tej: సంధ్య థియేటర్ తొక్కిసలాట .. మెరుగైన చికిత్స కోసం విదేశాలకు శ్రీతేజ్! బన్నీవాసు కీలక నిర్ణయం!

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన శ్రీతేజ్ ప్ర‌స్తుతం సికింద్రా బాద్ కిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. గత రెండు నెలలుగా ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉంటోన్న ఈ బాలుడి ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. అయితే శ్రీ తేజ్‌ త్వరగా కోలుకోవడానికి ఇంకా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు చెబుతున్నారు.

Sri Tej: సంధ్య థియేటర్ తొక్కిసలాట .. మెరుగైన చికిత్స కోసం విదేశాలకు శ్రీతేజ్! బన్నీవాసు కీలక నిర్ణయం!
Producer Bunny Vasu

Updated on: Feb 02, 2025 | 6:35 PM

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అత‌డిని సికింద్రాబాద్ కిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు రెండు నెల‌లుగా అత‌ను ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. ఇక శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని అల్లు అరవింద్, అల్లు అర్జున్, బన్నీవాస్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. శ్రీ తేజ్ చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తామని కూడా ఇది వరకే ప్రకటించారు. తాజాగా నిర్మాత బన్నీ వాస్ మరోసారి శ్రీతేజ్ ను పరామర్శించారు. ఆదివారం (ఫిబ్రవరి 02) సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వచ్చిన ఆయన శ్రీతేజ్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలుడి ఆరోగ్యం కుదుట‌ప‌డుతోందని వైద్యులు చెప్పడంతో బ‌న్నీవాసు హర్షం వ్య‌క్తం చేశారు. అదే సమయంలో శ్రీతేజ్‌కు ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు విదేశాల‌కు తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఆస్ప‌త్రి వైద్యుల స‌ల‌హా మేర‌కు విదేశాల‌కు తీసుకుని వెళ్లాల్సి వ‌స్తే.. అందుకు అయ్యే వైద్య ఖ‌ర్చుల‌ను తామే భ‌రిస్తామ‌ని బన్నీ వాసు చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

కాగా పుష్ప 2 చిత్ర బృందం రేవ‌తి కుటుంబానికి ఆర్థిక సాయం అందించింది. హీరో అల్లు అర్జున్ కోటి, ద‌ర్శ‌కుడు సుకుమార్ రూ.50ల‌క్ష‌లు, నిర్మాత‌లు రూ.50ల‌క్ష‌లు ల చొప్పున మొత్తం రెండు కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. శ్రీతేజ్ కుటుంబానికి అన్ని వేళలా అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. వీరితో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తన ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీదుగా రూ. 25 లక్షలు, వేణు స్వామి తదితరులు శ్రీ తేజ్ కుటుంబానికి తమ వంతు ఆర్థిక సాయం అందజేశారు.

ఇవి కూడా చదవండి

సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో నిర్మాత బన్నీ వాసు