AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abbas: షాకింగ్.. అబ్బాస్‏కు ఏం జరిగింది ?.. ఆసుపత్రి బెడ్ పై ప్రేమదేశం హీరో.. ఆందోళనలో అభిమానులు..

ప్రేమదేశం తర్వాత తెలుగు.. తమిళ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించిన కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటాన్నారు. తన ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్‏లో స్థిరపడ్డారు. అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజినీర్‎గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే చాలా కాలంగా అటు సినీ పరిశ్రమకు..

Abbas: షాకింగ్.. అబ్బాస్‏కు ఏం జరిగింది ?.. ఆసుపత్రి బెడ్ పై ప్రేమదేశం హీరో.. ఆందోళనలో అభిమానులు..
Abbas
Rajitha Chanti
|

Updated on: Nov 21, 2022 | 8:12 PM

Share

హీరో అబ్బాస్..90వ దశకంలో యూత్ లవర్ బాయ్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. 1996లో ప్రేమ దేశం సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన అబ్బాస్.. ఆ మూవీతోనే ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్నారు. ముఖ్యంగా ఈ హీరోకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. ప్రేమదేశం తర్వాత తెలుగు.. తమిళ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించిన కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటాన్నారు. తన ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్‏లో స్థిరపడ్డారు. అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజినీర్‎గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే చాలా కాలంగా అటు సినీ పరిశ్రమకు.. సోషల్ మీడియాకు దూరంగా ఉన్న అబ్బాస్..తాజాగా ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటో షేర్ చేసి అభిమానులకు షాకిచ్చాడు. దీంతో తనకు ఏం జరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

అయితే అబ్బాస్ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోను అబ్బాస్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆసుపత్రిలో ఉన్న సమయలో నా మనసంతా గందరగోళంగా ఉంది. దాన్ని అధిగమించేందుకు నేను ఎంతగానో ప్రయత్నించాను. శస్త్ర చికిత్స తర్వాత కొంత ఉపశమనం కలిగింది. నాకోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ తన ఫేస్ బుక్ లో రాసుకొచ్చాడు అబ్బాస్.

తెలుగులో రాజా, అనగనగా ఒక అమ్మాయి, కృష్ణ బాబు, అల్లుడుగారు వచ్చారు, మాధురి, నీ ప్రేమకై, శ్వేత నాగు, పొలిటికల్ రౌడీ, చంద్రహాస్, అనసూయ, ఇది సంగతి, బ్యాంక్, మారో, అలా జరిగింది ఒక రోజు వంటి సినిమాల్లో కనిపించారు. అయితే 2015లో ఆయన తన సినీ కెరీర్ కి బ్రేక్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.