
సిని పరిశ్రమలో పెళ్లి చేసుకోకుండానే తల్లులైన నటీమణులు చాలా మంది ఉన్నారు. కొందరు వివాహానికి ముందే గర్భవతి అయి బిడ్డకు జన్మనివ్వగా, మరికొందరు వివాహానికి ముందే బిడ్డను దత్తత తీసుకున్నారు. అయితే ఒక నటి ఒకరిద్దరిని కాదు ఒకేసారి 34 మంది పిల్లలను దత్తత తీసుకుంది. దీనితో పాటు ఆ నటికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… తన బలమైన వ్యక్తిత్వంతో రూ. 600 కోట్ల విలువైన ఆస్తిని కూడా తిరస్కరించింది. మరి పెళ్లికి ముందే కోట్ల విలువైన ఆస్తిని తిరస్కరించి 34 మంది పిల్లలకు తల్లి అయిన ఈ నటి ఎవరో తెలుసా.. సొట్ట బుగ్గల సుందరి.
మోడలింగ్ నుంచి సిని పరిశ్రమలోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా. దివంగత బాలీవుడ్ చిత్రనిర్మాత కమల్ అమ్రోహి కుమారుడు షాందర్ అమ్రోహి ప్రీతి జింటాను తన కూతురిలా చూసుకునేవాడు. ఆయన 2011 సంవత్సరంలో మరణించారు. ఆయన మరణం అంచులలో ఉన్న సమయంలో ప్రీతిని దత్తత తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ అవాస్తవాలు అంటూ ప్రీతి జింటా కొట్టి పడేసింది. షాందర్ అమ్రోహికి అవసరమైన సమయంలో తాను సహాయం చేసినట్లు.. ఎవరూ తనని దత్తత తీసుకోలేదని ప్రీతి జింటా స్పష్టం చేసింది.
షాందర్ అమ్రోహి ప్రీతి జింటాను సొంత కూతురులా చూసేవారు అని.. తనకున్న 600 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని ప్రీతికి బఇవ్వాలని భావించినట్లు వార్తలు వినిపించేవి. అయితే షాందర్ కోరికను ప్రీతి సున్నితంగా తిరస్కరించిందని.. తనది కాని ఆస్తిని తీసుకోవడానికి అంగీకరించలేదని బీ టౌన్ లో టాక్. ఆ సమయంలో షాందర్ అమ్రోహి ఆస్తి విషయంలో కొడుకుల మధ్య ఓ రేంజ్ లో గొడవలు జరుగుతూ ఉండేవట. అప్పుడు తాను వేరొకరి ఆస్తిని తీసుకోవడానికి వీధు నుంచి తాను రాలేద అని చెప్పినట్లు తెలుస్తోంది.
2009 సంవత్సరంలో తన 34వ పుట్టినరోజున ప్రీతి జింటా గొప్ప పని చేసింది. ఈ సమయంలో నటి రిషికేశ్‌లోని మదర్ మిరాకిల్ అనాథాశ్రమం లోని 34 మంది బాలికలను దత్తత తీసుకుంది. ప్రీతి వారి పూర్తి బాధ్యతను తీసుకుంది. పిల్లల ఆహారం, చదువు సహా ఇతర ఖర్చులన్నీ ఆ నటి స్వయంగా భరిస్తుంది.
2016లో, ప్రీతి తనకంటే 10 సంవత్సరాలు చిన్నవాడు, ఆర్థిక విశ్లేషకుడు అయిన జీన్ గూడెనఫ్ అనే అమెరికన్ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె అమెరికాకు మకాం మార్చింది. వివాహం తర్వాత ఇద్దరూ 2021 సంవత్సరంలో సరోగసి ద్వారా కవలలు జై, జియాలకు తల్లిదండ్రులు అయ్యారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..