Prakash Raj: అది నాన్ సెన్స్ సినిమా.. ఆస్కార్‌ కాదు కదా.. భాస్కర్‌ అవార్డు కూడా రాదు.. ప్రకాశ్‌రాజ్‌ సంచలన వ్యాఖ్యలు

కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్(MBIFL 2023)ఈవెంట్ లో పాల్గొన్న ప్రకాశ్ రాజ్  మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ విజయాన్ని కొనియాడుతూనే.. ది కశ్మీర్‌ ఫైల్స్ సినిమాపై షాకింగ్ కామెంట్స్‌ చేశారు

Prakash Raj: అది నాన్ సెన్స్ సినిమా.. ఆస్కార్‌ కాదు కదా.. భాస్కర్‌ అవార్డు కూడా రాదు.. ప్రకాశ్‌రాజ్‌ సంచలన వ్యాఖ్యలు
Prakash Raj
Follow us
Basha Shek

|

Updated on: Feb 07, 2023 | 12:38 PM

సినిమాలతో పాటు వివాదాలతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ హైలెట్‌ అవుతున్నారు. ఏ విషయన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ప్రకాశ్‌ రాజ్‌ తాజాగా పఠాన్‌, కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్(MBIFL 2023)ఈవెంట్ లో పాల్గొన్న ప్రకాశ్ రాజ్  మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ విజయాన్ని కొనియాడుతూనే.. ది కశ్మీర్‌ ఫైల్స్ సినిమాపై షాకింగ్ కామెంట్స్‌ చేశారు. ‘పఠాన్ సినిమాను బ్యాన్ చేయాలన్న ఈ ఇడియట్స్, బిగాట్స్ ఎవరైతే ఉన్నారో.. ఇప్పుడా సినిమా రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసి దూసుకుపోతోంది. పఠాన్ సినిమాను బ్యాన్ చేయాలని గోల చేసినవారే.. మోడీ సినిమాకు కనీసం రూ.30 కోట్లు కూడా వసూలు రాబట్టలేకపోయారు. అలాంటివారు కేవలం మొరుగుతారంతే, కరవరు. జస్ట్ సౌండ్ పొల్యూషన్ మాత్రమే’

‘ఇక రీసెంట్ గా వచ్చిన నాన్ సెన్స్ మూవీస్ లో ‘కశ్మీర్ ఫైల్స్’ ఒకటి. ఆ సినిమాను ఎవరో ప్రొడ్యూస్ చేశారో మనందరికీ తెలుసు. ఇది చాలా సిగ్గుచేటు. ఇంటర్నేషనల్ జ్యూరీనే ఈ మూవీ మేకర్స్ పై ఉమ్మేసింది. పైగా తనకు ఆస్కార్ నామినేషన్ రాలేదని డైరెక్టర్ అడుగుతున్నాడు. నిజం చెప్తున్నా అతనికి ‘భాస్కర్’ అవార్డు కూడా రాదు. ఎందుకంటే బయట చాలా సెన్సిటివ్ మీడియా ఉంది. కాబట్టి నేను మీకు చెప్తున్నా. మీరు ఒక ప్రోపగాండాతో సినిమా చేయొచ్చు. నాకు తెలిసి ఇలాంటి సినిమాలు చేయడానికే వాళ్లు దాదాపు రూ. 2000 కోట్లు పెట్టుబడి పెట్టారేమోననిపిస్తుంది. కానీ, ప్రతిసారి జనాల్ని ఫూల్ చేయలేరు’ అని ప్రకాశ్‌రాజ్‌ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. కాగా ఆస్కార్ అవార్డుకు పేరడీగా అత్తారింటికి దారేది సినిమాలో భాస్కర్ అవార్డుతో ఓ కామెడీ సీన్ ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడా విషయాన్నే గుర్తు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రకాశ్ రాజ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..