AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthi Reddy: పవన్‌ కల్యాణ్‌ కల్ట్‌ క్లాసిక్‌ ‘తొలి ప్రేమ’ హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా? ఏం చేస్తుందంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాన్‌ సినిమా కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు, ఇండస్ట్రీ హిట్లు ఉండచ్చు గాక .. కానీ తొలి ప్రేమ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రేమకథా చిత్రాల్లో ఎవర్‌ గ్రీన్‌ కల్ట్‌ క్లాసిక్‌గా నిలిచే ఈ సినిమాను ఇప్పటికీ టీవీల్లో వస్తే అసలు విడిచిపెట్టరు.

Keerthi Reddy: పవన్‌ కల్యాణ్‌ కల్ట్‌ క్లాసిక్‌ 'తొలి ప్రేమ' హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా? ఏం చేస్తుందంటే?
Keerthi Reddy
Basha Shek
|

Updated on: Feb 07, 2023 | 11:33 AM

Share

పవర్ స్టార్ పవన్ కల్యాన్‌ సినిమా కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు, ఇండస్ట్రీ హిట్లు ఉండచ్చు గాక .. కానీ తొలి ప్రేమ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రేమకథా చిత్రాల్లో ఎవర్‌ గ్రీన్‌ కల్ట్‌ క్లాసిక్‌గా నిలిచే ఈ సినిమాను ఇప్పటికీ టీవీల్లో వస్తే అసలు విడిచిపెట్టరు. తొలిప్రేమ సినిమా పవన్‌ సినిమా కెరీర్‌కు పెద్ద బూస్ట్‌ నిచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో హీరోయిన్‌గా నటించిన కీర్తి రెడ్డికి కీడా ఎక్కడలేని క్రేజ్‌ తీసుకొచ్చింది. ఈ చిత్రంలో ఆమె అందం, అభినయానికి రెండు రాష్ట్రాల్లోని కుర్రకారు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా సినిమాలోని ఆమె ఎంట్రీ సీన్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తొలిప్రేమ సినిమా వడ్డే నవీన్‌తో కలిసి ప్రేమించే సినిమాలో నటించింది. ఆ తర్వాత రావోయి చందమామలో నాగార్జున మరదలిగా మన్మథుడిని ఆట పట్టించింది. ఆపై అర్జున్‌ మూవీలో మహేష్ బాబు సోదరిగా మెప్పించింది. తెలుగులో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడ కూడా రెండు మూడు సినిమాలు తీసింది. అయితే అంతగా విజయాలు దక్కించుకోలేకపోయింది.

ఆతర్వాత మళ్లీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి హీరో అక్కినేని సుమంత్ ను పెళ్లి చేసుకుంది. అయితే వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. దాంపత్య జీవితంలో గొడవలు రావడంతో పెళ్లి చేసుకున్న ఏడాదికే సుమంత్, కీర్తి రెడ్డి విడిపోయారు. అయితే విడాకుల తర్వాత ఒక ఎన్‌ఆర్‌ఐను రెండో వివాహం చేసుకుంది కీర్తి రెడ్డి. రెండో వివాహం తర్వాత అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడింది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆమె ప్రస్తుతం పిల్లల ఆలనాపాలనలోనే బిజీగా గడుపుతోంది. సోషల్‌ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. అయితే ఆ మధ్యన ఒక సినిమా ఫంక్షన్‌లో కనిపించి సందడి చేసింది.

ఇవి కూడా చదవండి