AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush update: ‘ఆదిపురుష్’ నుంచి క్రేజీ అప్‏డేట్ రానుందా ? ఆరోజున ప్రభాస్ లుక్ వచ్చే ఛాన్స్..

Adipurush Movie Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‏తో..బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. 3డీ టెక్నాలజీతో ఈ సినిమాను భారీ బడ్జెట్‏తో రూపొందిస్తున్నాడు ఓంరౌత్. రామాయణ

Adipurush update: 'ఆదిపురుష్' నుంచి క్రేజీ అప్‏డేట్ రానుందా ? ఆరోజున ప్రభాస్ లుక్ వచ్చే ఛాన్స్..
Prabhas Adipurush
Rajitha Chanti
|

Updated on: Mar 24, 2021 | 10:15 PM

Share

Adipurush Movie Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‏తో..బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. 3డీ టెక్నాలజీతో ఈ సినిమాను భారీ బడ్జెట్‏తో రూపొందిస్తున్నాడు ఓంరౌత్. రామాయణ గాథ నేపథ్యంలో తెరకెక్కనుండగా.. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో రావణుడిగా నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించనుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్నాడన్న వార్తల నేపథ్యంలో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.

రాముడి పాత్రలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నారనేదానిపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ కొన్ని రకాల ఫోటోలను కూడా క్రియేట్ చేసి.. సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఎప్పుడూ మాస్ యాంగిల్ లేదా.. లవర్ బాయ్‏గా ప్రభాస్ ఇప్పటివరకు పౌరాణిక పాత్రలలో కనిపించింది లేదు. దీంతో ప్రభాస్ లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాముడి లుక్‏లో ప్రభాస్ ఎలా ఉంటాడు ? అనే సందేహాలు ఇప్పటికీ చాలా మందిలో ఉన్నాయి. తాజాగా ఈ సందేహాలు తోలగిపోయే సమయం వచ్చేసింది..ప్రభాస్ లుక్ రీవిల్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. త్వరలో ప్రభాస్ రాముడు పోస్టర్ విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా బీటౌన్‏లో టాక్ వినిపిస్తుంది. ఇందుకు ప్రధానంగా ఒక డేట్‏ను కూడా ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. ఏప్రిల్ 21న శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు సిద్దమవుతోందట యూనిట్. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్. ఇటీవల సైఫ్ న్యూలుక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. సైఫ్ అలీఖాన్ సతీమణి హీరోయిన్ కరీనా కపూర్ రెండొవ బిడ్డకు జన్మనివ్వడంతో నెలరోజుల పాటు సైఫ్ ఆదిపురుష్ షూటింగ్ కు బ్రేక్ తీసుకున్నాడు. ఈక్రమంలోనే న్యూ హెయిర్ కట్ తో సైఫ్ కెమెరాలకు చిక్కాడు. దీంతో సైఫ్‏ను చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్‏లో సైఫ్ లుక్ ఇదే అని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైఫ్ న్యూ లుక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం.

Also Read:

ట్రాన్స్‏జెండర్ కూతురిని పరిచయం చేసిన షకీలా.. నెట్టింట్లో వైరల్‏గా మారిన ఫోటోలు..

బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే.. తొమ్మిదేళ్ళ తర్వాత అక్కడకు రీఎంట్రీ ఇస్తున్న బుట్టబొమ్మ..

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!