Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. స్పిరిట్ షూటింగ్‌కు ముహూర్తం ఫిక్స్! రిలీజ్ ఎప్పుడంటే?

కల్కి తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. త్వరలోనే హను రాఘవ పూడి సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు డార్లింగ్. దీంతో పాటు స్పిరిట్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. స్పిరిట్ షూటింగ్‌కు ముహూర్తం ఫిక్స్! రిలీజ్ ఎప్పుడంటే?
Spirit Movie

Updated on: Jan 31, 2025 | 4:58 PM

సలార్, కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్నాడు పాన్ ఇండియా స్టార్ నటుడు ప్రభాస్. ప్రస్తుతం ఈ స్టార్ హీరో చేతిలో దాదాపు అరడజనుకు పైగా సినిమాలున్నాయి. కాగా కొవిడ్‌కి ముందు ఏడాదిలో ప్రభాస్ ఒక్క సినిమా మాత్రమే రిలీజయ్యేది. అయితే 2023లో ఆ రూల్ ని బ్రేక్ చేశాడు ప్రభాస్. 2023లో డార్లింగ్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. కానీ 2024లో మళ్లీ కల్కి సినిమా మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు ఏడాదికి రెండు సినిమాల రూల్ ను కచ్చితంగా ఫాలో అవ్వాలని ప్రభాస్ గట్టిగా అనుకుంటున్నాడట. అందులో భాగంగానే ఈ ఏడాది డార్లింగ్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. త్వరలోనే ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ కూడా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయనున్నాడు డార్లింగ్. మేలో ‘స్పిరిట్‌’ సినిమా షూటింగ్‌ను ప్రారంభించే అవకాశముంది. ఏడాదిలోగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తవుతుందని సమాచారం. 2026 ప్రారంభంలో లేదా మధ్యలో స్పిరిట్ విడుదల అయ్యే అవకాశముంది.

నిజాయతీపరుడైన ఓ పోలీస్ ఆఫీసర్ పగ ప్రతీకార కథతో ‘స్పిరిట్’ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. తన నిజాయితీ కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్న ఓ పోలీసు అధికారి తన కుటుంబాన్ని చంపడానికి ప్రయత్నించిన విలన్‌ని వేటాడడం అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందని సమాచారం. సినిమా ఫస్ట్ హాఫ్‌లో నిజాయితీగా, క్రమశిక్షణతో ఉండే ప్రభాస్ సెకండ్ హాఫ్‌లో మోస్ట్ వయలెంట్ గా కనిపించనున్నడని టాక్ .

ఇవి కూడా చదవండి

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి ఈ స్పిరిట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తన గత రెండు చిత్రాలకు భిన్నంగా ఉంటుందని ఇది వరకే సందీప్ వంగా తెలిపారు. బాలీవుడ్ కు చెందిన భూషణ్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. గతంలో ఇదే భూషణ్ కుమార్ ప్రభాస్ సినిమా కు నిర్మాతగా వ్యవహరించారు.

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.