AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా భార్య అబార్షన్ సమయంలో ఆ స్టార్ హీరో ఫోన్ చేశారు.. అది జీవితంలో మర్చిపోలేను..

ప్రముఖ హాస్యనటుడు ప్రభాస్ శ్రీను తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కామెడీ విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. నెగిటివ్ పాత్రలు చేస్తూనే కామెడీని కూడా పండించి ప్రేక్షకులను అలరించారు ప్రభాస్ శ్రీను. స్టార్ హీరోల సినిమాల్లో నటించారు ప్రభాస్ శ్రీను..

నా భార్య అబార్షన్ సమయంలో ఆ స్టార్ హీరో ఫోన్ చేశారు.. అది జీవితంలో మర్చిపోలేను..
Prabhas Srinu
Rajeev Rayala
|

Updated on: Jun 02, 2026 | 7:31 PM

Share

ప్రభాస్ శ్రీను.. కమెడియన్ గా, విలన్ గా తన మార్క్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే ఎంతయో మంది స్టార్ హీరోలతో కలిసి నటించాడు ప్రభాస్ శ్రీను. రెబల్ స్టార్ ప్రభాస్ కు మంచి స్నేహితుడు ఈ యాక్టర్. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ప్రభాస్ శ్రీను. జూనియర్ ఎన్టీఆర్ తెరపై మాత్రమే కాదు, తెర వెనుక కూడా అత్యంత ఎనర్జిటిక్, ఎమోషనల్ వ్యక్తి అని ప్రభాస్ శ్రీను అన్నారు. ప్రభాస్ శ్రీను ప్రకారం, ఎన్టీఆర్ స్క్రీన్‌పై కనిపించే దానికంటే ఆఫ్-స్క్రీన్‌లో పూర్తిగా విభిన్నంగా, అత్యంత పవర్ గా ఉంటారు. ఆయన చాలా ఎమోషనల్ అని, నచ్చని విషయాలను సులువుగా తీసుకోలేరని శ్రీను తెలిపారు. ఎన్టీఆర్ లోపలి భావోద్వేగాలను ఆయన మాటల్లోనే తెలుసుకోవచ్చని, ఆయన చాలా సరదాగా ఉంటారని కూడా చెప్పారు.

యమదొంగ షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను శ్రీను గుర్తు చేసుకున్నారు. ఆయన భార్య అబార్షన్ అయ్యిందని ఆ టైంలో ఎన్టీఆర్ స్వయంగా ప్రభాస్ శ్రీనుకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారని, “టెన్షన్ పడకు, ఇవన్నీ నార్మల్, నీకు నెక్స్ట్ పుట్టేవాడు నాలాంటివాడు పుడతాడు” అని ఓదార్చారని శ్రీను వివరించారు. అంతేకాదు, ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే టికెట్లు పంపిస్తానని కూడా ఎన్టీఆర్ ఆప్యాయంగా చెప్పారని తెలిపారు. ఆ సమయంలో తాను కేవలం ఎంట్రీ స్థాయి నటుడిని మాత్రమేనని, అలాంటి తనకు ఎన్టీఆర్ చూపిన మానవత్వం అద్భుతమని శ్రీను కొనియాడారు.

జూనియర్ ఎన్టీఆర్ ఒక గొప్ప కుక్ అని ప్రభాస్ శ్రీను వెల్లడించారు. ఇంట్లో ఎవరు పిజ్జా చేయరని తాను అనుకునేవాడినని, కానీ ఎన్టీఆర్ ఇంట్లో స్వయంగా పిజ్జా చేసి అద్భుతంగా వండిస్తారని తెలిపారు. అలాగే, మలేషియాలో ఒక షూటింగ్ సందర్భంగా మూడు రోజులు అక్కడే ఉన్నప్పుడు, ఒక సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న వాటితో నెయ్యి వేసి టమాటా పచ్చి పచ్చడి చేశారని, అది వేడి రైస్‌తో తింటే యూనిట్ సభ్యులు అద్భుతంగా ఉందని ప్రశంసించారని శ్రీను వివరించారు. ఎన్టీఆర్ తల్లి కూడా అనేక రకాల వెరైటీలు వండుతారని, పైనాపిల్ కర్రీ, మిల్క్ విత్ పైనాపిల్ కర్రీ వంటి వినూత్న వంటకాలను తాను చూశానని శ్రీను తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us