Salaar: ప్రభాస్‌ సలార్‌ సినిమా టికెట్ల ధరల పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండనున్నాయంటే?

|

Dec 15, 2023 | 5:44 PM

కేజీఎఫ్‌ సిరీస్‌ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్స్మ్‌ సంస్థనే సలార్‌ను కూడా నిర్మించింది. అయితే తెలంగాణ నైజాం హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ సొంతం చేసుకుంది. తాజాగా టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అలాగే అదనపు షోస్‌ అనుమతి కోసం మైత్రీ మేకర్స్ అధినేతలు తెలంగాణ ప్రభుత్వానికి రిక్వెస్ట్‌ చేశారట

Salaar: ప్రభాస్‌ సలార్‌ సినిమా టికెట్ల ధరల పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండనున్నాయంటే?
Prabhas Salaar Movie
Follow us on

ప్రభాస్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న సలార్ మూవీ రిలీజ్‌కు సమయం దగ్గరపడుతోంది. మరో వారం రోజుల్లో (డిసెంబర్‌ 22) సలార్‌ థియేటర్లలోకి అడుగుపెడుతున్నాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ హై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌పై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే పోస్టర్స్‌, టీజర్స్‌, ట్రైలర్‌ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ సాంగ్ కూడా ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌, సాంగ్‌లో ప్రభాస్‌ లుక్స్‌, ఎలివేషన్స్‌ ఆకట్టుకోవడంతో మరింత హైప్‌ క్రియేట్ అయ్యింది. సలార్‌ రన్‌టైమ్‌ 2గంటల 55నిమిషాలు ఉన్న ఈ మూవీ టికెట్‌ రేట్లు పెరగనున్నట్లు తెలుస్తోంది.  కేజీఎఫ్‌ సిరీస్‌ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్స్మ్‌ సంస్థనే సలార్‌ను కూడా నిర్మించింది. అయితే తెలంగాణ నైజాం హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ సొంతం చేసుకుంది. తాజాగా టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అలాగే అదనపు షోస్‌ అనుమతి కోసం మైత్రీ మేకర్స్ అధినేతలు తెలంగాణ ప్రభుత్వానికి రిక్వెస్ట్‌ చేశారట. అలాగే రిలీజ్‌ రోజున సింగిల్‌ థియేటర్‌లో 6 ఆటలు ప్రదర్శించేందుకు అనుమతులివ్వాలని తెలంగాణ సర్కార్‌ను కోరారట.

ప్రస్తుతం ఉన్న టికెట్‌ రేట్లకు మరో రూ.100 పెంచుకునేలా మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేతలు కోరినట్లు తెలుస్తోంది. అంటే సింగిల్‌ స్క్రీన్​లోనే ఒక టికెట్‌ ధర సుమారు రూ. 300 వరకు ఉండే అవకాశముంది. అదే మల్టీప్లెక్స్​ల్లో అయితే రూ. 400 పైగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. రిలీజ్‌ (డిసెంబర్ 22) రోజున కొన్ని థియేటర్లలో అర్ధరాత్రి ఒంటి గంటలకే సలార్‌ షోస్‌ ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన అన్ని థియేటర్లలో ఉదయం 4 గంటల నుంచే సలార్‌ బొమ్మ పడనున్నట్లు సమాచారం. డిసెంబర్‌ 15 నుంచి సలార్ టికెట్ల అమ్మకాలు ప్రారంభా కావాల్సి ఉంది. అయితే టికెట్‌ రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే నిర్ణయాన్ని బట్టి ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ స్టార్ట్‌ అవుతాయని సమాచారం. సలార్‌ సినిమాలో మలయాళ సూపర్‌ స్టార్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మరో కీలక పాత్ర పోషించాడు. శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి

కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.