
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందన సభ జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం (ఆగస్టు 18) హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి కృష్ణం రాజు, ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కృష్ణంరాజు లేకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవటం కుదరదని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఇక పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని రేవంత్ రెడ్డి ప్రశంసించారు. తెలుగు సినిమా హాలీవుడ్‌ను ఢీకొట్టే సత్తా ఉందని ప్రభాస్ నిరూపించారని, ఆయన లేకుండా బాహుబలిని ఊహించలేమని సీఎం కొనియాడారు. ఇదే సందర్భంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తనకు మంచి మిత్రుడంటూ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి స్పెషల్ గిఫ్ట్ అందించారామె. తాపేశ్వరం సురుచి నుంచి తెప్పించిన బాహుబలి కాజాను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘బాహుబలి రేంజ్ బహుమతి అట్లుంటది మరీ’ అని ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. తాజాగా సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడితో చేయబోయే సినిమాకు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. అలాగే మారుతితో కలిసి ‘ది రాజాసాబ్’ షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు డార్లింగ్. వీటితో పాటు ‘కల్కి 2’, ‘సలార్ 2’, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. మరి ఈ చిత్రాలు ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తాయో చూడాలి.
Telangana Chief Minister about Telangana king👑#Prabhas pic.twitter.com/0U1Gsz071F
— Prabhas Trends (@TrendsPrabhas) August 18, 2024
A delightful beginning to an epic project ✨
Highlights from the #PrabhasHanu pooja ceremony 🤩
Shoot begins soon 🎥
Rebel Star #Prabhas @hanurpudi #Imanvi #MithunChakraborty #JayaPrada @Composer_Vishal @kk_lyricist @MrSheetalsharma @sudeepdop… pic.twitter.com/Y0mAWhc89g
— Mythri Movie Makers (@MythriOfficial) August 18, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.