- Telugu News Photo Gallery Cinema photos Do you know which is the only Telugu movie starring Aishwarya Rai. it is Ravoyi Chandamama
ఐశ్వర్య రాయ్ నటించిన ఏకైక తెలుగు సినిమా ఎదో తెలుసా..? హీరో ఎవరంటే..
భూమీద ఐశ్వర్య రాయ్ కంటే అందమైన అమ్మాయి మరొకరు ఉండరు అని అంటుంటారు. ఆమెను చూస్తే నిజమే అని చెప్పాలి. 1994వ సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపికైంది. ఆమె ఎన్నో సినిమాల్లోనూ యాడ్ లలోనూ నటించింది.
Updated on: Aug 19, 2024 | 9:13 PM

భూమీద ఐశ్వర్య రాయ్ కంటే అందమైన అమ్మాయి మరొకరు ఉండరు అని అంటుంటారు. ఆమెను చూస్తే నిజమే అని చెప్పాలి. 1994వ సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపికైంది. ఆమె ఎన్నో సినిమాల్లోనూ యాడ్ లలోనూ నటించింది.

ఫిలింఫేర్ పురస్కారాల నామినేషన్ తో పాటు ఎన్నో పురస్కారాలు అందుకుంది ఐశ్వర్య. 2009లోభారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఇక సినిమాల్లో సూపర్ సక్సెస్ అయ్యింది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది ఐష్.

ఐశ్వర్య 10 ఫిలింఫేర్ నామినేషన్లు అందుకున్నారు. అందులో హమ్ దిల్ దే చుకే సనమ్ (1999), దేవదాస్ (2002) సినిమాలకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది ఈ అందాల భామ.

ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసింది. రెండు దశాబ్దాలు బాలీవుడ్ చిత్రసీమను ఏకధాటిగా ఏలింది. ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా క్యూ లైన్‌లో నిలబడేవారు. అంతలా క్రేజ్ సొంతం చేసుకుంది ఐశ్వర్య.

అలాగే తమిళ్ లోనూ అడపాదడపా సినిమాలు చేసింది. అయితే ఐశ్వర్య రాయ్ తెలుగులో నటించిందన్న విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. అవును ఐశ్వర్య తెలుగులో సినిమా చేసింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన రావోయి చందమామ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుంది ఐష్.




