Prabhas: ఏం లాభం భయ్యా.. నాగ్ అశ్విన్ దెబ్బకు మరోసారి ఓం రౌత్‌ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్

సినిమా గ్లింప్స్ రిలీజ్ అయినా దగ్గర నుంచి ఆదిపురుష్ పై నెటిజన్లు మండిపడ్డారు. దారుణమైన వీఏఫ్ఎక్స్ కారణంగా ఈ సినిమా పై నెగిటివ్ కామెంట్స్ ఘోరంగా వచ్చాయి. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత దర్శకుడు ఓం రౌత్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్. ఓం రౌత్ కమ్ టూ మై రూమ్ అంటూ ఆడేసుకున్నారు ఫ్యాన్స్. అంతే కాదు రామాయణంలాంటి ఇతిహాసన్ అపహాస్యం చేసేలా సినిమా తెరకెక్కించారని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశాయి. 

Prabhas: ఏం లాభం భయ్యా.. నాగ్ అశ్విన్ దెబ్బకు మరోసారి ఓం రౌత్‌ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్
Om Raut, Nag Ashwin
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 31, 2023 | 2:17 PM

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా పై జరిగిన ట్రోల్స్ గురించి అందరికి తెలిసిందే.. సినిమా కనే ఆ మూవీ వీఎఫ్ ఎక్స్ మీద వచ్చిన ట్రోలింగ్స్ ఎక్కువ.. అంత పెద్ద స్టార్ హీరో, భారీ బడ్జెట్ పెట్టుకొని నిరాశపరిచావ్ అంటూ ప్రేక్షకులు పెద్ద ఎత్తున మండిపడ్డారు. సినిమా గ్లింప్స్ రిలీజ్ అయినా దగ్గర నుంచి ఆదిపురుష్ పై నెటిజన్లు మండిపడ్డారు. దారుణమైన వీఏఫ్ఎక్స్ కారణంగా ఈ సినిమా పై నెగిటివ్ కామెంట్స్ ఘోరంగా వచ్చాయి. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత దర్శకుడు ఓం రౌత్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్. ఓం రౌత్ కమ్ టూ మై రూమ్ అంటూ ఆడేసుకున్నారు ఫ్యాన్స్. అంతే కాదు రామాయణంలాంటి ఇతిహాసన్ అపహాస్యం చేసేలా సినిమా తెరకెక్కించారని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశాయి.

ఇప్పటికి కూడా ఓం రౌత్ పై ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి. మొన్నీమధ్య ఓం రౌత్ తన ఫోతోనూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటో పై కూడా నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఇదిలా ఉంటే ఓం రౌత్ ను టార్గెట్ చేశారు డార్లింగ్ ఫాన్స్.. అందుకు కారణం మన టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

అంతకు ముందు రిలీజ్ చేసిన ప్రభాస్ పోస్టర్ పై కూడా ట్రోల్స్ వచ్చాయి. హాలీవుడ్ మూవీ ఐరన్ మ్యాన్ పోస్టర్ ను కాపీ కొట్టారు అని కామెంట్స్ వచ్చి. కానీ గ్లింప్స్ చూసిన తర్వాత ట్రోలర్స్ నోర్లు మూతపడ్డాయి . హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఈ సినిమా ఉంటుందని ఒక్క వీడియోతో చెప్పేశారు నాగ్ అశ్విన్. అద్భుతమైనవిజువల్ వండర్ గా ఈ మూవీ ఉండనుందని ఈ చిన్న వీడియో చూస్తే అర్ధమవుతుంది. 2898 వ సంవత్సరంలో భూమి ఎలా ఉంటుందో.. అప్పుడు పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో.. ఈ సినిమాలో చూపించనున్నారని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా పరిస్థితులు గ్రాఫిక్ వీఎఫ్ఎక్స్ కూడా అద్భుతంగా క్రియేట్ చేస్తున్నారు. దాంతో ఓం రౌత్ ను టార్గెట్ చేస్తూ.. 700 కోట్లు పెట్టి సినిమా తీశావ్ ఏం లాభం.? నాగ్ అశ్విన్ వర్క్ చూడు  అంటూ మండిపడుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా.. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సినిమాలు చేయకుండా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సామ్
సినిమాలు చేయకుండా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సామ్
ఈ సంక్రాంతికి అందంగా మెరిసిపోవాలా.. ఇవి రాస్తే చాలు..
ఈ సంక్రాంతికి అందంగా మెరిసిపోవాలా.. ఇవి రాస్తే చాలు..
అమ్మా నీకు హ్యాట్సాఫ్..'మదర్‌ ఆఫ్‌ ది ఇయర్‌'అవార్డ్‌ ఇవ్వాల్సిందే
అమ్మా నీకు హ్యాట్సాఫ్..'మదర్‌ ఆఫ్‌ ది ఇయర్‌'అవార్డ్‌ ఇవ్వాల్సిందే
ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ యూట్యూబ్‌ ఛానెల్‌ క్లోజ్‌.. జాగ్రత్త
ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ యూట్యూబ్‌ ఛానెల్‌ క్లోజ్‌.. జాగ్రత్త
బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న రష్మిక..
బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న రష్మిక..
టీమిండియా తదుపరి సిరీస్ వివరాలు, పూర్తి షెడ్యూల్ ఇదిగో
టీమిండియా తదుపరి సిరీస్ వివరాలు, పూర్తి షెడ్యూల్ ఇదిగో
నిద్ర లేవగానే టీ, కాఫీలు తాగుతున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
నిద్ర లేవగానే టీ, కాఫీలు తాగుతున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
బైక్‌ నెంబర్‌ ప్లేట్‌ను కనిపించకుండా చేస్తున్నారా? భారీ పెనాల్టీ!
బైక్‌ నెంబర్‌ ప్లేట్‌ను కనిపించకుండా చేస్తున్నారా? భారీ పెనాల్టీ!
సినిమాల్లోకి అకీరా నందన్ ఎంట్రీ.. రేణూ దేశాయ్ ఏమన్నారంటే?
సినిమాల్లోకి అకీరా నందన్ ఎంట్రీ.. రేణూ దేశాయ్ ఏమన్నారంటే?
షూట్స్‎తో బిజీ బిజీగా టాలీవుడ్.. ఏ హీరో.. ఎక్కడంటే.?
షూట్స్‎తో బిజీ బిజీగా టాలీవుడ్.. ఏ హీరో.. ఎక్కడంటే.?