Chiranjeevi: పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ సినిమా చూడాలి.. జాగ్రత్త పడాలి : చిరంజీవి

ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అందమైన ప్రేమ కథతో పాటు ఎమోషన్స్ కూడా చక్కగా చూపించారు ఈ మూవీలో.. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ నటన ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో సక్సెస్ ససెలబ్రేషన్స్ చేశారు చిత్రయూనిట్. ఈ క్రమంలో మెగా ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు .

Chiranjeevi: పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ సినిమా చూడాలి.. జాగ్రత్త పడాలి : చిరంజీవి
Chiranjeevi
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 31, 2023 | 2:17 PM

రీసెంట్ డేస్ లో వచ్చిన సినిమాల్లో సంచలన విజయం సాధించిన సినిమా బేబీ. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అందమైన ప్రేమ కథతో పాటు ఎమోషన్స్ కూడా చక్కగా చూపించారు ఈ మూవీలో.. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ నటన ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో సక్సెస్ ససెలబ్రేషన్స్ చేశారు చిత్రయూనిట్. ఈ క్రమంలో మెగా ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు . చిరంజీవి మాట్లాడుతూ.. చిత్రయూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు. సినిమాలోనూ ప్రతి అంశం గురించి మాట్లాడిన చిరు. చిత్రానికి పని చేసిన అందరిని అభినందించారు.

అలాగే ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా చూడగానే ఇది ఓ ఎడ్యుకేటెడ్ మూవీ అనిపించింది. ఈ సినిమా కథ నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా మీరు వదిలినా.. సినిమా మిమ్మల్ని వదలదు.. నేను రెండు మూడు రోజులు ఈ సినిమా ఫీల్ లోనే ఉన్నాను అన్నారు. అలాగే చాలా మంది యువత సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోయి. అదే ప్రపంచంగా బ్రతుకుతున్నారు. అది మన చేతిలోనే ఉంది అనుకుంటున్నారు. కానీ మనమే దాని చేతిలో ఉంటున్నాం. ఫ్రెండ్స్ తో చాటింగ్స్ చేస్తూ.. ఎక్కడో ఎదో ఒక మాట అంటారు.. లేదా ఎదో ఒక చేష్ట ఉంటుంది. అవతలి వారు దాన్ని పట్టుకుంటారు. దాంతో వీళ్ళను బ్లాక్ మైల్ చేయడమో.. అవతలివారిని లోబరుచుకోవడమో చేస్తుంటారు. ఇలాంటివి చాలా చాలా జరుగుతుంటాయి అన్నారు.

చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లలే కాదు.. తల్లి దండ్రులు కూడా ఈ సినిమా చూసి ఇప్పుడున్న పరిస్థితులను తెలుసుకొని మన పిల్లల పట్ల జాగ్రత్త పడాలి. తెలిసి తెలియని పరిస్థితుల్లో అలంటి వాటిలో చిక్కుకొని పిల్లలు ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. కాబట్టి తల్లి దండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని మెగాస్టార్ తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ సినిమాను తప్పకుండా చూసి.. చాలా నేర్చుకోవాలి అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.