Prabhas: నటుడు రాజేంద్రప్రసాద్ను పరామర్శించిన ప్రభాస్..
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ను యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్ పరామర్శించారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించారు. శుక్రవారం మధ్యాహ్నం ఛాతీలో నొప్పి రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఒంటిగంటకు ఆమె తుదిశ్వాస విడిచారు
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ను యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్ పరామర్శించారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించారు. శుక్రవారం మధ్యాహ్నం ఛాతీలో నొప్పి రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఒంటిగంటకు ఆమె తుదిశ్వాస విడిచారు. గాయత్రి మరణం అటు సినీ ప్రముఖులను, అభిమానులను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. కూకట్ పల్లిలోని ఇందు విల్లాస్ లోని రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లిన ప్రభాస్ ఆయన కూతురు గాయత్రి చిత్రపటం నివాళులు అర్పించారు. అనంతరం కూతురు మృతితో తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన రాజేంద్రప్రసాద్ ను.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.