
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా… భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా నిరాశ పరిచింది. దీంతో ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలపైనే ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు షూటింగ్స్ చివరి దశలో ఉన్నాయి. ఇవే కాకుండా.. మరోవైపు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలోనూ ఓ మీడియా బడ్జెట్ మూవీ చేస్తున్నారు ప్రభాస్. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. కొద్ది రోజులుగా షూట్ ఆగింది. ప్రభాస్ కల్కి, సలార్ సినిమాలతో బిజీగా ఉండడంత మారుతి మూవీకి బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది.
వచ్చే వారం నుంచే ప్రభాస్, మారుతి సినిమా నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం. హైదరాబాద్ లో ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతున్నట్లు సెట్ వర్క్ పూర్తికాగానే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ షూటింగ్ మొదలు పెడతారని టాక్. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు.
ప్రస్తుతం ప్రభాస్ డెరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సలార్ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శ్రుతి హాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.