vakeel saab movie : వకీల్ సాబ్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి కారణం ఇదేనా..

| Edited By: Ravi Kiran

Apr 30, 2021 | 8:49 AM

పెద్ద హీరో సినిమా 50 రోజులు దాటితే గాని ఓటీటీలో రిలీజ్‌ చేసే ప్రసక్తే లేదు... వకీల్‌ సాబ్‌ రిలీజ్ టైంలో నిర్మాత దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పిన మాట ఇది

vakeel saab movie : వకీల్ సాబ్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి కారణం ఇదేనా..
పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీ వర్కింగ్ స్టిల్స్
Follow us on

పెద్ద హీరో సినిమా 50 రోజులు దాటితే గాని ఓటీటీలో రిలీజ్‌ చేసే ప్రసక్తే లేదు… వకీల్‌ సాబ్‌ రిలీజ్ టైంలో నిర్మాత దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పిన మాట ఇది. దీంతో థియేట్రికల్‌ రిలీజ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వకీల్‌ సాబ్‌ సినిమాను ఓటీటీలో చూడాలంటే రెండు నెలలు వెయిట్ చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్‌.

కానీ సడన్‌గా డెసిషన్‌ మార్చేసుకున్నారు మేకర్స్‌. 50 రోజుల నియమాన్ని పక్కన పెట్టేసి 21వ రోజే ఓటీటీ రిలీజ్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ఈ నిర్ణయం వెనుకగా చాలా కారణాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. గతంలో స్టార్ హీరో సినిమా అంటే 50 రోజులు, 100 రోజులు థియేటర్లలో నడిచేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా మహా అయితే ఒక నెల థియేటర్లలో ఉంటుంది. అంతకు మించి నడవటం అంటే అద్భుతమనే చెప్పాలి.

అసలే కోవిడ్ టైంలో రిలీజ్ అయిన వకీల్‌ సాబ్‌ నెల రోజులు కూడా నడిచే పరిస్థితి కనిపించలేదు. 10 రోజుల తరువాత కలెక్షన్లు డ్రాప్‌ అయ్యాయి. చాలా చోట్ల థియేటర్ల విషయంలో ఆంక్షలు మొదలయ్యాయి. ఈ టైంలో థియేటర్లలోనే సినిమా అంటూ లేట్‌ చేస్తే ఓటీటీ రేటు పడిపోతుంది. అందుకే ముందుగానే ఓటీటీకి ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారట మేకర్స్‌. ఇక పవన్ దాదాపు మూడేళ్ళ తర్వాత నటించిన ఈ సినిమా పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

దేవసేనకు పెళ్లంట.. తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోనున్న అనుష్క.. నెట్టింట్లో స్వీటీ మ్యారెజ్ గాసిప్..

Aha OTT: మ‌రో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఆహా.. వంద‌కుపైగా దేశాల్లో కోటికి చేరిన డౌన్‌లోడ్‌లు..

61వ సినిమాకు కూడా ఆ దర్శకుడికే ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో.. మూడోసారి ‘వాలిమై’ డైరెక్టర్‏తోనే అజిత్..