Pawan Kalyan: పవర్ స్టార్ ఓజీ నుంచి క్రేజీ న్యూస్.. అనుకున్నదానికంటే ముందే

హరిహర వీరమల్లు షూటింగ్ చివరిదశకు చేరుకోగా.. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఇందులో సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న మూవీ ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్). సుజిత్, పవన్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Pawan Kalyan: పవర్ స్టార్ ఓజీ నుంచి క్రేజీ న్యూస్.. అనుకున్నదానికంటే ముందే
Pawan Kalyan

Updated on: May 26, 2023 | 10:06 AM

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వీలైనంత త్వరగా తన సినిమాలన్నిపూర్తి చేసి.. ఎన్నికల నాటికి రాజకీయాల్లో పాల్గొనేందుకు ట్రై చేస్తున్నారు పవన్. ఈ క్రమంలోనే ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలపై ఫోకస్ పెట్టారు. హరిహర వీరమల్లు షూటింగ్ చివరిదశకు చేరుకోగా.. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఇందులో సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న మూవీ ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్). సుజిత్, పవన్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొద్ది రోజుల క్రితం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాగా.. పవర్ స్టార్ సెట్‏లో అడుగుపెట్టారు. ఇక ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సముద్రఖని దర్శకత్వంలో బ్రో అనే సినిమా చేస్తున్నారు పవన్. అలాగే ఓజీ సినిమాను కూడా అదే సమయంలో పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా అనుకున్నదానికంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తోంది.

సుజిత్ తెరకెక్కిస్తోన్న ఓజీ సినిమాను పవన్ కల్యాణ్ అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా ప్లాన్ కూడా చేసుకున్నాడని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ‘ఓజీ’ ‘బ్రో’ సినిమాలు చేస్తున్నారు. బ్రో, ఓజీ సినిమాలను వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట మేకర్స్.