Pawan Kalyan: ఆ యంగ్ డైరెక్టర్‌కు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట..!!

వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు పవర్ స్టార్. ఇక ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో సినిమా  చేస్తున్నారు పవన్.

Pawan Kalyan: ఆ యంగ్ డైరెక్టర్‌కు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట..!!
Power Star Pawan Kalyan

Updated on: Oct 02, 2022 | 8:22 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలతో మరో వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. చిన్న గ్యాప్ తీసుకొని తిరిగి సినిమాల్లో ఫుల్ స్వింగ్ లో షూటింగ్స్ చేస్తున్నారు. వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు పవర్ స్టార్. ఇక ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో సినిమా  చేస్తున్నారు పవన్. హరిహరవీరమల్లు అనే పిరియాడికల్ మూవీ చేస్తున్నారు. పవన్ కెరీర్ లో బిగెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనుంరని టాక్. కోహినూరు వజ్రం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. ఇక ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్  ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళ్‌ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు పవన్. ఈ సినిమా భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ సినిమా చేస్తున్నారు పవన్. ఇదిలా ఉంటే సాహూ దర్శకుడు సుజిత్ తో పవన్ సినిమా చేయడానికి రెడీ అయ్యారట.

అయితే తమిళంలో దళపతి విజయ్ నటించిన ‘తేరి’ సినిమా రీమేక్ ను తెలుగులో పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్నారు సుజీత్. ఇప్పుడు ప్లాన్స్ మారినట్లు తెలుస్తోంది. సుజీత్ ఓ కొత్త కథను సిద్ధం చేసుకొని పవన్ కి చెప్పారట. కథ నచ్చడంతో పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమాను అఫీషియల్ గా లాంచ్ చేయాలనుకుంటున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5 న పూజాకార్యక్రమాలతో షూటింగ్ ను లాంచ్ చేయనున్నారట. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us