Pooja Hegde: ఫాలోవర్లకు ఛాలెంజ్ విసిరిన బుట్టబొమ్మ.. అదెంటో తెలుసా ?.
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ప్రస్తుతం ఫుల జోష్ మీదుంది. ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ప్రస్తుతం ఫుల జోష్ మీదుంది. ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంలో నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి సరసన బీస్ట్ సినిమాలో నటిస్తుండగా.. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాలోనూ కనిపించనుంది. ఓవైపు చేతినిండా సినిమాలతో పుల్ బిజీగా ఉంటున్న ఈ అమ్మడు.. మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా పూజా హెగ్డే మాల్దీవ్స్ ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ నెట్టింట్లో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఫాలోవర్లకు సరికొత్త ఛాలెంజ్ విసిరింది. మరి అదెంటో తెలుసుకుందామా.
తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి నటించిన బీస్ట్ చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ అందించిన అరబిక్ కుతు పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. ఆ వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. తనలాగ స్టెప్స్ వేయాలంటూ ఫాలోవర్లను కోరింది. పూజా హెగ్డే షేర్ చేసిన ఈ వీడియోకు క్షణాల్లో భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. పూజా హెగ్డే మాదిరిగా స్టెప్పులేస్తూ ఆకట్టుకుంటున్నారు నెటిజన్స్. మొత్తానికి ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ తో రచ్చ చేసే పూజా హెగ్దే ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకునే పడింది.. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ పాట యూట్యూ్బ్ను షేక్ చేస్తోంది. విడుదలైన గంటల్లోనే మిలియన్ వ్యూస్ అందుకుని దూసుకుపోతుంది.
View this post on Instagram
Also Read: Zodiac Signs: ఈ నాలుగు రాశులవారు ప్రతీకారం తీర్చుకోకుండా అస్సలు వదిలిపెట్టరు.. ఎవరో తెలుసా..
Sandhya Mukherjee: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో ప్రముుఖ సింగర్ మృతి..