Pooja Hegde: బుట్టబొమ్మకు కలిసిరాని ఏడాది.. మరో భారీ ప్రాజెక్ట్ నుంచి పూజా అవుట్ ?..

| Edited By: Rajitha Chanti

Aug 18, 2023 | 11:34 PM

వరుస ఫెయిల్యూర్స్ కారణంగా వచ్చిన అవకాశాలు కూడా పూజ కిట్టీ నుంచి జారీపోతున్నాయి. ఈ పరిస్థితుల్లోనూ మంచి రోజులు వస్తాయని ఫుల్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు బుట్టబొమ్మ. రాధేశ్యామ్ రిలీజ్‌కు ముందు కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద ఆశలు ఆవిరి చేసేసింది. రాధేశ్యామ్‌ సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్‌గా బిజీ అవ్వొచ్చని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది.

Pooja Hegde: బుట్టబొమ్మకు కలిసిరాని ఏడాది.. మరో భారీ ప్రాజెక్ట్ నుంచి పూజా అవుట్ ?..
Pooja Hegde
Follow us on

నిన్నమొన్నటి వరకు స్టార్ హీరోయిన్‌గా నెంబర్ వన్‌ ప్లేస్‌ను ఎంజాయ్ చేసిన పూజా హెగ్డే ఇప్పుడు టఫ్‌ సిచ్యుయేషన్‌ను ఫేస్ చేస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ కారణంగా వచ్చిన అవకాశాలు కూడా పూజ కిట్టీ నుంచి జారీపోతున్నాయి. ఈ పరిస్థితుల్లోనూ మంచి రోజులు వస్తాయని ఫుల్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు బుట్టబొమ్మ. రాధేశ్యామ్ రిలీజ్‌కు ముందు కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద ఆశలు ఆవిరి చేసేసింది. రాధేశ్యామ్‌ సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్‌గా బిజీ అవ్వొచ్చని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది. ఆ తరువాత నార్త్ ఆశలన్నీ సల్మాన్ సినిమా కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌ మీదే పెట్టుకున్నారు పూజా.

సల్మాన్ మూవీ కూడా బుట్టబొమ్మకు షాక్ ఇచ్చింది. భారీ ఆశలు పెట్టుకున్న భాయ్‌ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయ్యింది. దీంతో నార్త్‌లో పూజ కెరీర్‌కు బ్రేకులు పడ్డాయి. అదే సమయంలో సౌత్‌లోనూ బుట్టబొమ్మకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈ మధ్యకాలంలో భారీ ప్రాజెక్ట్స్‌ నుంచి పూజా హెగ్డే తప్పుకున్నారు.

ఇవి కూడా చదవండి

పూజా హెగ్డే ఇన్ స్టా పోస్ట్..

డేట్స్ అడ్జస్ట్ కాకే తప్పుకున్నారని చెబుతున్నా… అమ్మడి ఫిల్మోగ్రఫీ చూస్తే అంత బిజీగా ఉన్నట్టుగా కనిపించటం లేదు. అసలు తెలుగు, హిందీలో ఒక్క సినిమా కూడా ఈ బ్యూటీ చేతిలో లేదు.

పూజా హెగ్డే ఇన్ స్టా పోస్ట్..

ఈ సిచ్యుయేషన్‌లోనూ ఫ్యూచర్ మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నారు పూజా హెగ్డే. ప్రజెంట్‌ డిస్కషన్‌ స్టేజ్‌లో ఉన్న సినిమాలు తన కెరీర్‌ను మళ్లీ గాడిలో పెడతాయంటున్నారు. మరి అప్‌ కమింగ్ సినిమాలతోనూ అరవిందకు మంచి రోజులొస్తాయేమో చూడాలి.

పూజా హెగ్డే ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.