Ponniyin Selvan: ఎవరిని ఎవరు కాపీకొట్టారు భయ్యా..!! రాయల్ ట్రీట్‌మెంట్ అన్నారు ఇదేనా..!

|

Oct 01, 2022 | 10:40 AM

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. భారీ తారాగణం, అదిరిపోయే విజువల్స్ , నెక్స్ట్ లెవల్ లో గ్రాఫిక్స్ అన్నారు.. కానీ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల చెప్పేది మాత్రం వేరేలా ఉంది.

Ponniyin Selvan: ఎవరిని ఎవరు కాపీకొట్టారు భయ్యా..!! రాయల్ ట్రీట్‌మెంట్ అన్నారు ఇదేనా..!
Ponniyin Selvan Vs Baahubal
Follow us on

40ఏళ్ల కలట….400కోట్లకు పైగా బడ్జెట్ అంటూ తెగ ప్రచారం చేశారు. ఇప్పటివరకు ఒకెత్తు పొన్నియన్ సెల్వన్ ఒకెత్తు అంటూ ఊదరగొట్టేశారు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. భారీ తారాగణం, అదిరిపోయే విజువల్స్ , నెక్స్ట్ లెవల్ లో గ్రాఫిక్స్ అన్నారు.. కానీ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల చెప్పేది మాత్రం వేరేలా ఉంది. తమిళగుభాళింపులు గుప్పుమంటూ తగిలిన పొన్నియన్ సెల్వన్..నిజంగా అద్భుతమా..అంటే కాస్త ఆలోచిస్తున్నారు ఆడియన్స్. మీరు చెప్పింది.. మేము చూసింది ఒకటేనా అంటూ థియేటర్స్ నుంచి బయటలు వస్తున్నారు. అసలు ప్రేక్షకుల్లో ఈ నిరాశ ఎందుకు అంటే ..

పొన్నియన్ సెల్వన్ రిలీజ్ కు ముందు బాహుబలి సినిమాను పోల్చుతూ పొన్నియన్ సెల్వన్ ముందు బాహుబలి జుజుబీ అంటూ మాట్లాడుకున్నారు తమిళ్ తంబీలు.. మన మణిభయ్యాదా తురుమ్..మన పొన్నియన్ సెల్వన్‌దా రుస్తుమ్‌దానా…అర్ధమాయిందా….అంటూ మణిరత్నం పొన్నియన్ సెల్వన్ పై అరవ మీడియా తెగరాసేసింది. తెగ వాగేసింది. నభూతో నభవిష్యత్ అని తేల్చేసింది….అసలు బాహుబలి ఊహపా.. పొన్నియన్ సెల్వన్ నిజందానాఅంటూ ఊదరగొట్టింది.. మణిరత్నం రాయల్ ట్రీట్‌మెంట్‌కు…ఏఆర్ రెహమాన్ వీర కొట్టుడుకు…అందరూ ఫిదా కావాల్సిందేగా.. అంటూ బాహుబలిని తక్కువ చేసిన వాళ్లంతా..ఇప్పుడు గప్‌చుప్ సాంబార్ బుడ్డి అంటున్నారట.

ఎందకటా అంటే కథ నవల నుంచి వచ్చిందే..కాని ట్రీట్‌మెంట్‌ బాహుబలి నుంచే వచ్చిందట. కథనమే కాదు క్యారెక్టర్లు కూడా సేమ్ టు సేమ్ అలాగే దించేశారఅంటున్నారు సినిమా చూసినవాళ్లు. అంతకంటే మరీ విడ్డూరమేంటంటే…ఫైనల్ ట్విస్ట్ కూడా బాహుబలి 1తోనే పోలి ఉందట. ఏంటి నమ్మడంలా..మేమూ నమ్మలేదు…తీరా సినిమా చూశాక కానీ తెల్వలేదు…ఇది కాపీ కొట్టుడు రాయల్ ట్రీట్‌మెంట్ అని. మరి బాహుబలిని మణిరత్నం కాపీ కొట్టాడా…లేక పొన్నియన్ సెల్వన్ కథను చదివి రాజమౌళి స్పూర్తి పొందాడా…? అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.