AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mallik Tej: ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ ఎక్కడ..? ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు

యువతులను వేధించడం, అత్యాచార ఆరోపణలతో నిత్యం వార్తల్లో నలుగుతున్నారు. ఇక ఇప్పుడు మరో ప్రముఖుడుకూడా ఇదే కేసులో చిక్కుకున్నాడు. యూట్యూబర్, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పై రేప్ కేసు నమోదయ్యింది. మాయ మాటలు చెప్పి తనపై ఆత్యాచారం చేసినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Mallik Tej: ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ ఎక్కడ..? ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
Mallikteja
Rajeev Rayala
|

Updated on: Sep 30, 2024 | 1:28 PM

Share

మొన్న రాజ్ తరుణ్, ఆతర్వాత జానీ మాస్టర్, ఆ వెంటనే హర్ష సాయి ఇలా వరుసగా ప్రముఖులంతా వార్తల్లో నిలుస్తున్నారు. యువతులను వేధించడం, అత్యాచార ఆరోపణలతో నిత్యం వార్తల్లో నలుగుతున్నారు. ఇక ఇప్పుడు మరో ప్రముఖుడు కూడా ఇదే కేసులో చిక్కుకున్నాడు. యూట్యూబర్, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పై రేప్ కేసు నమోదయ్యింది. మాయ మాటలు చెప్పి తనపై ఆత్యాచారం చేసినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను  బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. దాంతో మల్లిక్ తేజ్ పై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. అలాగే ఆయువతి తన ఫిర్యాదులో..

ఇది కూడా చదవండి : ఏందో మావ.. నిన్న మొన్నటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు.. ఇప్పుడు ఇలా షాక్‌లు ఇస్తున్నారు..!

మల్లిక్ తేజ్ తరచూ ఫోన్ చేసి వేధిస్తూన్నాడని, బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో మల్లిక్ తేజ్ పై రేప్ కేసుతోపాటు మరికొన్ని కేసులను కూడా నమోదు చేశారు జగిత్యాల జిల్లా పోలీసులు. తనతోపాటు తన కుటుంబ సభ్యులపై దుర్భాషలాడాడని.. తనను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కోనడంతో అతడిపై కేసు నమోదు చేసిన జగిత్యాల పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఫోక్ సింగర్ మల్లిక్‌తేజ్‌ పరారీలో ఉన్నాడు.

ఇది కూడా చదవండి :Nani’s Gang Leader: హేయ్.. గ్యాంగ్ లీడర్ పాప ఇది నువ్వేనా..! మరీ ఇంత మార్పా..!!

పరారీలో ఉన్న ఫోక్ సింగర్ మల్లిక్‌తేజ కోసం జగిత్యాల పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఉమ్మడి కరీంనగర్‌, హైదరాబాద్‌తో పాటు పలుచోట్ల వెతుకుతున్నారు. మల్లిక్‌తేజ్‌ ఆచూకీ కోసం అతని స్నేహితులు, బంధువులను ఆరాతీస్తున్నారు పోలీసులు. ఇప్పటికే యువతి వాంగ్మూలం రికార్డ్ చేసిన పోలీసులు ఫోక్ సింగర్ కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు.

ఇది కూడా చదవండి : పవన్ కళ్యాణ్ పంజా భామ పిచ్చేక్కించిందిగా..! సినిమాలకు గుడ్ బై చెప్పి ఇప్పుడేం చేస్తుందంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..