AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mangalavaram: ఓటీటీలోకి వచ్చేసిన ‘మంగళవారం’.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా ?..

ఇక ఇటీవలే మంగళవారం సినిమాలో సరికొత్త ప్రయోగం చేసింది. ఇన్నాళ్లు కథానాయికగా గ్లామరస్ పాత్రలే ఎంచుకున్న పాయల్.. ఇప్పుడు హారర్, థ్రిల్లర్ కంటెంట్‏తో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇటీవల పాయల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మంగళవారం'. ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్లలో నవంబర్ 17న విడుదలైంది. కానీ అదే సమయంలో క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఉండడంతో

Mangalavaram: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం'.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా ?..
Mangalavaram Movie
Rajitha Chanti
|

Updated on: Dec 26, 2023 | 8:21 AM

Share

తొలి సినిమాతోనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అదరగొట్టేసింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. గ్లామర్, నటనతో మెప్పించింది. కానీ ఆ తర్వాత తెలుగులో అంతంగా అవకాశాలు రాలేదు. ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఇక ఇటీవలే మంగళవారం సినిమాలో సరికొత్త ప్రయోగం చేసింది. ఇన్నాళ్లు కథానాయికగా గ్లామరస్ పాత్రలే ఎంచుకున్న పాయల్.. ఇప్పుడు హారర్, థ్రిల్లర్ కంటెంట్‏తో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇటీవల పాయల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మంగళవారం’. ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్లలో నవంబర్ 17న విడుదలైంది. కానీ అదే సమయంలో క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఉండడంతో ఈ చిత్రానికి అంతగా రెస్పాన్స్ రాలేదు. అయితే ఈ సినిమాను చూసిన కొందరు అడియన్స్ మాత్రం పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‎లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక థియేటర్లలో ఈ సినిమా మిస్ అయినవారు ఇప్పుడు ఇంట్లోనే ఈ హారర్ థ్రిల్లర్ మూవీని చూసేయ్యోచ్చు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ కి తోడు హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో ఈ సినిమా థియేటర్లలో మాత్రం హిట్ అయ్యింది. ఇందులో మరోసారి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది పాయల్.

సినిమా కథ విషయానికి వస్తే..

ఓ గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తుంటాయి. అవి కూడా కేవలం మంగళవారం మాత్రమే జరుగుతుంటాయి. ఆ మరణాలకు కారణం అక్రమ సంబంధం అని ఊరి ప్రజలు అనుకుంటారు. కానీ అవి ఆత్మహత్యలు కాదు హత్యలు అని పోలీసులకు అనుమానం కలుగుతుంది. ఈ హత్యలకు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు ఉన్న సంబంధమేంటీ అనేది మంగళవారం సినిమా కథ. ఇందులో నందిత శ్వేత, అజ్మల్ అమీర్, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అజ్నీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.