అందాల పాయ‌ల్ శంక‌ర్ సినిమాలో ఛాన్స్ ప‌ట్టేసింది..!

‘ఆర్‌ఎక్స్‌ 100’ మూవీతో టాలీవుడ్ సెన్సేష‌నల్ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్. ఒక్క సినిమాతోనే కుర్ర‌కారు గుండెల్లో సెగ‌లు రేపింది. బోల్డ్‌ అండ్‌ డేరింగ్‌ పెర్ఫామెన్స్‌తో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది‌. అనంతరం వెంకటేశ్, రవితేజ వంటి టాలీవుడ్ టాప్ హీరోల‌ సరసన ఆడిపాడింది. కానీ, అవేమీ ఆమెకు టాప్ హీరోయిన్ గా నిల‌దొక్కుకునేందుకు ఉప‌యోగ‌ప‌డలేదు. అయితే తాజాగా ఈ భామకు సాత్ ఇండియా అగ్ర ద‌ర్శ‌కుడు శంకర్‌ సినిమాలో నటించే అవకాశం దక్కిందని ఫిల్మ్ […]

అందాల పాయ‌ల్ శంక‌ర్ సినిమాలో ఛాన్స్ ప‌ట్టేసింది..!

‘ఆర్‌ఎక్స్‌ 100’ మూవీతో టాలీవుడ్ సెన్సేష‌నల్ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్. ఒక్క సినిమాతోనే కుర్ర‌కారు గుండెల్లో సెగ‌లు రేపింది. బోల్డ్‌ అండ్‌ డేరింగ్‌ పెర్ఫామెన్స్‌తో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది‌. అనంతరం వెంకటేశ్, రవితేజ వంటి టాలీవుడ్ టాప్ హీరోల‌ సరసన ఆడిపాడింది. కానీ, అవేమీ ఆమెకు టాప్ హీరోయిన్ గా నిల‌దొక్కుకునేందుకు ఉప‌యోగ‌ప‌డలేదు. అయితే తాజాగా ఈ భామకు సాత్ ఇండియా అగ్ర ద‌ర్శ‌కుడు శంకర్‌ సినిమాలో నటించే అవకాశం దక్కిందని ఫిల్మ్ వ‌ర్గాల స‌మాచారం​.

ప్రస్తుతం శంకర్​.. కమల్‌హాసన్ హీరోగా ‘భారతీయుడు 2’ చిత్రం తెర‌కెక్కిస్తున్నారు. కాజల్, రకుల్‌ ప్రీత్‌ సింగ్, సిద్ధార్థ్‌ తదితరులు ఈ మూవీలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రంలోనే ఓ స్పెష‌ల్ సాంగ్ కోసం పాయల్‌ను సంప్రదించిందట మూవీ యూనిట్‌. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న మూవీ, అందునా క‌మ‌ల్-శంక‌ర్ కాంబినేష‌న్ కాబట్టి ఒకేసారి అటు నార్త్, ఇటు సౌత్ భాషల్లోనూ క్రేజ్‌ దక్కించుకునే అవకాశం పాయల్​కు వరించినట్లవుతుంది. ఈ విషయంపై త్వరలోనే అఫిషియ‌ల్ ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఓ లేడి ఓరియెంటెడ్​ మూవీలో నటిస్తోంది.