AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నో చేదు అనుభవాలు నన్ను వెంటాడాయి..సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన న‌టి

త‌న జీవితంలో ఎన్నో చేదు అనుభ‌వాల‌ను ఎద‌ర్కున్నాన‌ని చెప్పింది నటి కల్యాణి. కేరళకు చెందిన ఈమె బాలనటిగా సినిమా ఇండ‌స్ట్రీకి పరిచయమై ఆ త‌ర్వాత హీరోయిన్ గా కూడా రాణించింది. వెండితెర‌పై అవ‌కాశాలు త‌గ్గ‌డంతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. తరువాత టోటల్ గా ఫీల్డ్ నే వ‌దిలేసింది. నటనకు ఎందుకు దూర‌మ‌య్యార‌న్న ప్ర‌శ్న‌కు కల్యాణి బదులిస్తూ.. తానేన‌ని వెంట‌నే చెప్పింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థల్లో నుంచి ఆఫ‌ర్స్ ఉన్నాయంటూ ఫోన్లు వచ్చేవని, తమ చిత్రంలో హీరోయిన్ […]

ఎన్నో చేదు అనుభవాలు నన్ను వెంటాడాయి..సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన న‌టి
Ram Naramaneni
|

Updated on: May 29, 2020 | 11:12 PM

Share

త‌న జీవితంలో ఎన్నో చేదు అనుభ‌వాల‌ను ఎద‌ర్కున్నాన‌ని చెప్పింది నటి కల్యాణి. కేరళకు చెందిన ఈమె బాలనటిగా సినిమా ఇండ‌స్ట్రీకి పరిచయమై ఆ త‌ర్వాత హీరోయిన్ గా కూడా రాణించింది. వెండితెర‌పై అవ‌కాశాలు త‌గ్గ‌డంతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. తరువాత టోటల్ గా ఫీల్డ్ నే వ‌దిలేసింది. నటనకు ఎందుకు దూర‌మ‌య్యార‌న్న ప్ర‌శ్న‌కు కల్యాణి బదులిస్తూ.. తానేన‌ని వెంట‌నే చెప్పింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థల్లో నుంచి ఆఫ‌ర్స్ ఉన్నాయంటూ ఫోన్లు వచ్చేవని, తమ చిత్రంలో హీరోయిన్ మీరేనని చెప్పేవారని అంది. అందుకు సంతోషపడే లోపే అడ్జెస్ట్‌మెంట్‌ కావాలని అడిగేవార‌ని వివ‌రించింది. అది కాల్‌షీట్స్‌కు సంబంధించిన పదం అనుకుని తన తల్లి స‌రే అనేద‌ని ఆ తరువాత విషయం అర్థం తెలియడంతో అడ్జెస్ట్‌మెంట్‌ అన్న పదం వినిపిస్తే వెంట‌నే ఫోన్ క‌ట్ చేశామ‌ని చెప్పుకొచ్చింది.

కేవ‌లం సినిమాలోనే కాదు బుల్లితెరలోనూ అలాంటి చేదు అనుభవాలను చాలానే ఎదురైన‌ట్టు వెల్ల‌డించింది. ఒక టీవీ కార్యక్రమానికి యాంక‌ర్ గా చేస్తున్నప్పుడు అక్కడ హై లెవ‌ల్ ఉన్న వ్యక్తి రాత్రికి పబ్బుకు పిలిచారని, కానీ తాను కాపీ షాప్‌లో కలుసుకుందామని చెప్పానని అంది. అప్ప‌ట్నుంచి ఆ టీవీలో ఏ ప్రొగ్రామ్ లోనూ తనకు అవకాశం రాలేదని చెప్పింది. తాను నటనకు దూరం కావ‌డానికి ఇవే కార‌ణాలని వివ‌రించింది నటి కల్యాణి.

బ్లాక్ కాఫీ మంచిదని తెగ తాగుతున్నారా ? ఈ సమస్యలు ఖాయం!
బ్లాక్ కాఫీ మంచిదని తెగ తాగుతున్నారా ? ఈ సమస్యలు ఖాయం!
సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొస్తున్నారా..?
సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొస్తున్నారా..?
చలికాలంలో ఈ వ్యక్తులు పెరుగు తింటే అంతే సంగతులు.. కోరి సమస్యలు..
చలికాలంలో ఈ వ్యక్తులు పెరుగు తింటే అంతే సంగతులు.. కోరి సమస్యలు..
ఇంజినీరింగ్ చేసి ఇండస్ట్రీలోకి..ఇప్పుడు ఇతను సినిమా చేస్తే హిట్టే
ఇంజినీరింగ్ చేసి ఇండస్ట్రీలోకి..ఇప్పుడు ఇతను సినిమా చేస్తే హిట్టే
సంక్రాంతి నుంచి ఆ రాశులకు ఉద్యోగ యోగాలు..!
సంక్రాంతి నుంచి ఆ రాశులకు ఉద్యోగ యోగాలు..!
మకర సంక్రాంతి: గాలి పటాలకు శ్రీరాముడికి ఉన్న సంబంధం ఏంటి?
మకర సంక్రాంతి: గాలి పటాలకు శ్రీరాముడికి ఉన్న సంబంధం ఏంటి?
IND vs NZ 2nd ODI: రెండో వన్డేలోనూ తెలుగబ్బాయ్‌కి మొండిచేయి..?
IND vs NZ 2nd ODI: రెండో వన్డేలోనూ తెలుగబ్బాయ్‌కి మొండిచేయి..?
సంక్రాంతి తర్వాత వారి ప్రేమలు, పెళ్లి ప్రయత్నాలు సఫలం
సంక్రాంతి తర్వాత వారి ప్రేమలు, పెళ్లి ప్రయత్నాలు సఫలం
ఓరీ దేవుడో.. మనం వాడుతున్న పసుపు నకిలీదా..? ఎలా గుర్తించాలంటే..
ఓరీ దేవుడో.. మనం వాడుతున్న పసుపు నకిలీదా..? ఎలా గుర్తించాలంటే..
రైల్వే టికెట్ల బుకింగ్ రూల్స్ మారాయ్.. కొత్త మార్పులు ఇవే..
రైల్వే టికెట్ల బుకింగ్ రూల్స్ మారాయ్.. కొత్త మార్పులు ఇవే..