Pawan Kalyan: పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ బ్లాక్ బస్టర్ మూవీ రీరిలీజ్.. ఎప్పుడంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన సినిమా విడుదలైందంటే థియేటర్లలో పెద్ద పండగే. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్.. కొన్నాళ్లపాటు తన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. పవన్ చేతిలో ఇప్పుడు మూడు చిత్రాలు ఉండగా..ఆ సినిమాలు రిలీజ్ కావడానికి మరికొంత సమయం పట్టనుంది.

Pawan Kalyan: పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ బ్లాక్ బస్టర్ మూవీ రీరిలీజ్.. ఎప్పుడంటే..
Pawan Kalyan
Follow us

|

Updated on: Jul 17, 2024 | 5:01 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన సినిమా విడుదలైందంటే థియేటర్లలో పెద్ద పండగే. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్.. కొన్నాళ్లపాటు తన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. పవన్ చేతిలో ఇప్పుడు మూడు చిత్రాలు ఉండగా..ఆ సినిమాలు రిలీజ్ కావడానికి మరికొంత సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించినట్లు తెలుస్తోంది. పవన్ కెరీర్‏లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిత్రాల్లో వన్ ఆఫ్ ది మూవీ గబ్బర్ సింగ్. ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ 56వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగానే గబ్బర్ సింగ్ మూవీ స్పెషల్ షోలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ సినిమాను రీరిలీజ్ చేయనున్నారట. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈచిత్రాన్ని సెప్టెంబర్ 2న రీరిలీజ్ చేస్తున్నట్లు అనుశ్రీ ఫిలిమ్స్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఇన్నాళ్లు పవన్ సినిమాల విడుదలకై ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది పక్కా స్పెషల్ ట్రీట్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో శ్రుతిహాసన్ కథానాయికగా నటించింది. 2012లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో రూ.150 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. పరమేశ్వర్ ఆర్ట్ బ్యానర్ పై బండ్ల గణేశ్ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. పవన్ మేనరిజమ్, డైలాగ్స్, యాక్షన్, మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఇప్పుడు మరోసారి రిలీజ్ కాబోతుందని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ చిత్రంలో నటిస్తున్నారు పవన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. మరోవైపు డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు పవన్. కొన్నాళ్ల క్రితం విడుదలైన టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటి కలిగించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం