Badri Movie: పవన్ ఫ్యాన్స్‏కు మరో గుడ్ న్యూస్.. తొలిప్రేమ కంటే ముందే థియేటర్లలోకి ఆ బ్లాక్ బస్టర్ మూవీ..

|

Jan 07, 2023 | 8:47 AM

ఇప్పటికే జల్సా..ఖుషి సినిమాలు రీరిలీజ్ చేయడంతో తెగ ఎంజాయ్ చేశారు పవర్ స్టార్ అభిమానులు. ఇక ఇప్పుడు పవన్ కెరీర్ మలుపు తిప్పిన

Badri Movie: పవన్ ఫ్యాన్స్‏కు మరో గుడ్ న్యూస్.. తొలిప్రేమ కంటే ముందే థియేటర్లలోకి ఆ బ్లాక్ బస్టర్ మూవీ..
Pawan Kalyan
Follow us on

తెలుగు చిత్రపరిశ్రమలో రీరిలీజ్ అనేది ట్రెండ్ అవుతుంది. హీరోస్ పుట్టినరోజులు.. ప్రత్యేక రోజులలో మాత్రమే వారికి సంబంధించిన సూపర్ హిట్ చిత్రాలను 4కె వెర్షన్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పలు సినిమాలు థియేటర్లలో రీరిలీజ్ చేయగా.. మంచి వసూళ్లు రాబట్టాయి. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిపోయిన ఖుషి సినిమాను మళ్లీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు.. భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఖుషి రీరిలీజ్ వేళ థియేటర్లలో ఫ్యాన్స్ చేసిన రచ్చ గురించి తెలిసిందే. ఇప్పుడు పవర్ స్టార్ అభిమానుల ముందుకు మరో సూపర్ హిట్ చిత్రాన్ని తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే వాలెంటైన్స్ డే సందర్భంగా పిబ్రవరి 14న తొలిప్రేమ చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో బ్లాక్ బస్టర్ హిట్ తీసుకురానున్నారట.

ఇప్పటికే జల్సా..ఖుషి సినిమాలు రీరిలీజ్ చేయడంతో తెగ ఎంజాయ్ చేశారు పవర్ స్టార్ అభిమానులు. ఇక ఇప్పుడు పవన్ కెరీర్ మలుపు తిప్పిన బద్రి చిత్రాన్ని రీరిలీజ్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనవరి 26న ఈ సినిమాను మళ్లీ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. విదేశాల్లోనూ ఈ మూవీని భారీ ఎత్తున విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. దీంతో బద్రి సినిమా కూడా మరోసారి రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.