SIR: ధనుష్ సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో!! ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే
ఇదే క్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పిలవనున్నట్లు తెలుస్తోంది. ఫార్చ్యూన్ ఫోర్ నిర్మాణ సంస్థ త్రివిక్రమ్ ది కావడంతో.. మాటల మాంత్రికుడు చెప్తే పవన్ కచ్చితంగా వస్తాడన్నది ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో నేరుగా నటించిన మొదటి చిత్రం ‘సార్’. తమిళంలో వాతి పేరుతో రిలీజ్ చేస్తున్నారు తొలిప్రేమ, మజ్ఞు, రంగ్‌దే చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భీమ్లానాయక్‌తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న సంయుక్త మేనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి ఫార్య్చూన్ ఫోర్ నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచింది చిత్రబృందం. ఇప్పటికే పాటలు, టీజర్లు, ట్రైలర్లకు ఊహించని స్పందన రావడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మరింత గ్రాండ్‌గా నిర్వహించే యోచనలో ఉన్నారు మేకర్స్. ఇదే క్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పిలవనున్నట్లు తెలుస్తోంది. ఫార్చ్యూన్ ఫోర్ నిర్మాణ సంస్థ త్రివిక్రమ్ ది కావడంతో.. మాటల మాంత్రికుడు చెప్తే పవన్ కచ్చితంగా వస్తాడన్నది ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.
ఒకవేళ ఇదే నిజమైతే ధనుష్, పవన్ ఒకే వేదికపై కనిపించనున్నారు. ఇది ఇద్దరి అభిమానులకు కనువిందే. సార్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 17, 2023 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదల అయిన ‘మాస్టారు మాస్టారు’ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.




మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.