Bro Movie: బాక్సాఫీస్‌ వద్ద ‘బ్రో’ బీభత్సం.. మూడు రోజుల్లో పవన్‌, తేజ్‌ల మూవీకి ఎన్నికోట్లు వచ్చాయంటే?

భారీ అంచనాలతో విడుదలైన 'బ్రో' సినిమా బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపుతోంది. దేవుడి పాత్రలో పవన్‌ కల్యాణ్‌ను చూసేందుకు అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్‌ కూడా కనెక్ట్‌ అవుతుండడంతో బాక్సాఫీస్‌ వద్ద బ్రో భారీ వసూళ్లు సాధిస్తోంది.

Bro Movie: బాక్సాఫీస్‌ వద్ద బ్రో బీభత్సం.. మూడు రోజుల్లో పవన్‌, తేజ్‌ల మూవీకి ఎన్నికోట్లు వచ్చాయంటే?
Bro The Avatar Movie

Updated on: Jul 31, 2023 | 4:14 PM

భారీ అంచనాలతో విడుదలైన ‘బ్రో’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపుతోంది. దేవుడి పాత్రలో పవన్‌ కల్యాణ్‌ను చూసేందుకు అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్‌ కూడా కనెక్ట్‌ అవుతుండడంతో బాక్సాఫీస్‌ వద్ద బ్రో భారీ వసూళ్లు సాధిస్తోంది. జులై 28న విడుదలైన బ్రో సినిమాలో పవన్‌తో పాటు సాయి ధరమ్‌ తేజ్‌ మరో హీరోగా నటించాడు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ మెగా మల్టీ స్టారర్‌లో కేతిక శర్మ, ప్రియాంక వారియర్‌ కథానాయికలు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే సమకూర్చగా, థమన్‌ బాణీలు అందించారు. మొదటి రోజే రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన బ్రో.. రెండో రోజు మాత్రం కాస్త తగ్గాడు. అయితే ఆదివారం కావడంతో మళ్లీ పుంజుకున్నాడు. కాగా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాపంగా బ్రో సినిమా రూ.100 కోట్లు గ్రాస్‌ వసూళ్లు సాధించిందని ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ మనోబాల విజయబాలన్‌ ట్వీట్‌ చేశారు.

మొదటి రోజు 48.09 కోట్లు, రెండో రోజు రూ.27.61 కోట్లు సాధించిన బ్రో మూవీ ఆదివారం రూ.25 కోట్లు రాబట్టిందని మనోబాల ట్విట్టర్‌లో తెలియజేశారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ బ్రో మూవీని నిర్మించారు. తమిళ్‌ హిట్‌ మూవీ వినోదయ సిత్తం తెలుగు రీమేక్‌గా బ్రో మూవీ తెరకెక్కింది. మార్క్‌గా సాయి ధరమ్‌ తేజ్‌, టైటాన్‌ పాత్రల్లో పవన్‌ కల్యాణ్‌ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం బరిలో పెద్ద సినిమాలు లేకుండడం, బ్రో జోరు చూస్తుంటే రాబోయే రోజుల్లో మరిన్ని వసూల్లు వచ్చే అవకాశముందని ట్రేడ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..