Hari Hara Veeramallu Twitter Review: హరి హర వీరమల్లు ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ హరి హర వీరమల్లు. దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ సినిమా రావడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో విడుదలకు ముందు రోజు నుంచే థియేటర్ల వద్ద పవన్ ఫ్యాన్స్ హడావిడి స్టార్ట్ చేశారు. ఇక ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన అడియన్స్ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Hari Hara Veeramallu Twitter Review: హరి హర వీరమల్లు ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..
Hari Hara Veera Mallu

Updated on: Jul 24, 2025 | 6:46 AM

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ హరి హర వీరమల్లు. దాదాపు రెండేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఇది. దీంతో మొదటి నుంచి ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. గురువారం (జూలై 24న)ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా.. బుధవారం రాత్రే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు వేశారు. దీంతో విడుదలకు ముందు రోజే థియేటర్లకు అభిమానులు పోటెత్తారు. సినిమా హాళ్ల దగ్గర ఫ్యాన్స్ సంబరాల గురించి చెప్పక్కర్లేదు. ఇక ప్రీమియర్ షో ముగిసిన తర్వాత తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు.

హరి హర వీరమల్లు సినిమా స్టోరీ గురించి పవన్ ఇప్పటికే రివీల్ చేసిన సంగతి తెలిసిందే. కృష్ణా నదీ తీరంలో దొరికిన కోహినూర్ వజ్రం కాపాడేందుకు వీరమల్లు చేసే పోరాటమే ఈ సినిమా అని పవన్ వివరించారు. ఇక ఈ సినిమాపై పబ్లిక్ ఏమంటున్నారో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

హరి హర వీరమల్లు టైటిల్ కార్డ్ అదిరిపోయిందని.. ఇక ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ బాగుందని.. మరోసారి యాక్టింగ్ ఇరగదీశాడని అంటున్నారు. ఫస్టాఫ్, ఇంటర్వెల్ తర్వాత సైతం సినిమా బాగుందని పోస్టులు పెడుతున్నారు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సైతం అదిరిపోయిందని అంటున్నారు.

ట్వీట్స్..