పవర్ స్టార్ అయినా, డిప్యూటీ సీఎం అయినా ఎప్పుడూ సింపుల్ గానే కనిపిస్తుంటారు పవన్ కల్యాణ్. ఆడంబరాలు, హంగామాలకు పెద్దగా ప్రాధాన్యమివ్వరు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే పద్దతిని ఆయన కొనసాగిస్తున్నారు.పవన్ సింప్లిసిటీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి. ఇప్పుడు పవన్ బాటలోనే ఆయన కూతురు ఆద్య కూడా నడుస్తోంది. సింప్లిసిటీలో తండ్రికి తగ్గ తనయ అనిపిస్తోంది. ఇందుకు నిదర్శనమే ఈ వీడియో. తాజాగా తల్లి రేణూ దేశాయ్ తో కలిసి కాశీ యాత్రకు వెళ్లింది ఆద్య. అక్కడ సింపుల్ గా ఆటో రిక్షాలో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించింది. కారులో ప్రయాణించే స్టేటస్ ఉన్నప్పటికీ తన తల్లితో కలిసి సింపుల్ గా ఆటోలో జర్నీ చేసిందీ స్టార్ కిడ్. ఇందుకు సంబంధించిన వీడియో ను రేణూ దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఆద్య పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సింప్లిసిటీలో తండ్రికి తగ్గ తనయ అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.
కాగా ఇప్పుడే కాదు గతంలో బయట కనిపించిన పలు సందర్భాల్లో సింపుల్ గానే కనిపించింది ఆద్య. ఆ మధ్య స్వాతంత్ర్య వేడుకలు, తిరుమల పర్యటనల్లోనూ తండ్రితో కలిసి కనిపించింది ఆద్య. పవర స్టార్ కూతురు, డిప్యూటీ సీఎం డాటర్ అన్న దర్పం ఎక్కడా చూపించలేదు. ఇప్పుడు కూడా కాశీ యాత్రలో సింపుల్ గా ఆటోలో జర్నీ చేసి వార్తల్లో నిలిచిందీ స్టార్ కిడ్.
కాగా పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నాడన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. పవన్ నటిస్తోన్న ఓజీ సినిమాలో అకీరా కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నాడని తెగ ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.