Pawan Kalyan: పవన్, సాయి తేజ్ సినిమాపై క్రేజీ అప్డేట్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

| Edited By: seoteam.veegam

May 18, 2023 | 3:39 PM

ఇప్పటికే ఆయన వినోదయ సిత్తం రీమేక్ లో తన రోల్ షూటింగ్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసింది. డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరోసారి దేవుడి పాత్రలో కనిపించనున్నారు పవన్. ఈ తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Pawan Kalyan: పవన్, సాయి తేజ్ సినిమాపై క్రేజీ అప్డేట్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
Pawan Kalyan
Follow us on

వపర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భీమ్లా నాయక్ తర్వాత పవన్ నుంచి మరో సినిమా రాలేదు. కానీ ప్రస్తుతం ఆయన చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వన్ బై వన్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటికీ ఇప్పటివరకు ఏ సినిమా రిలీజ్ కాలేదు. దీంతో వీలైనంత త్వరగా తన ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసి.. తిరిగి రాజకీయాల్లో బిజీ కానున్నారు పవర్ స్టార్. ఇప్పటికే ఆయన వినోదయ సిత్తం రీమేక్ లో తన రోల్ షూటింగ్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసింది. డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరోసారి దేవుడి పాత్రలో కనిపించనున్నారు పవన్. ఈ తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

గత కొన్నాళ్లుగా అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆడియన్స్ నిరీక్షణకు తెర దించారు మేకర్స్. రేపు (మే 18న) సాయంత్రం 4 గంటల 14 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ సహా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీనితో ఈ సినిమా లుక్ అండ్ టైటిల్ విషయంలో ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమానే కాకుండా.. ప్రస్తుతం పవన్.. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే డైరెక్టర్ క్రిష్, పవన్ కాంబోలో హరి హర వీరమల్లు సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్స్ పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.