Pawan Kalyan: పవన్ సినిమాను వదలని లీకులు.. వినోదయ సిత్తం రీమేక్ షూట్ నుంచి ఫోటోలు
సినిమాను లీకుల నుంచి రక్షించుకోవడమే బిగ్ టాస్క్ గా మారిపోయింది ఇప్పటి ఫిల్మ్ మేకర్స్‌కి. ఓ సినిమా షూట్‌ను మొదలెట్టడమే ఆలస్యం.. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్‌తో.. ఆ షూట్ ఫోటోలను క్లిక్ చేసి..

లీక్ ఇప్పుడు ఫిల్మ్ ఫెటర్నీటీని ఇబ్బంది పెడుతున్న మాట. భయపెడుతున్న మాట ! బాధ పెడుతున్న మాట! ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నయా ఫిల్మ్ చుట్టూ కూడా తిరిగుతోంది ఇదే మాట.! చచ్చీ చెడి.. కష్టపడి ఓ సినిమా తీయడం కంటే.. ఆ సినిమాను లీకుల నుంచి రక్షించుకోవడమే బిగ్ టాస్క్ గా మారిపోయింది ఇప్పటి ఫిల్మ్ మేకర్స్‌కి. ఓ సినిమా షూట్‌ను మొదలెట్టడమే ఆలస్యం.. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్‌తో.. ఆ షూట్ ఫోటోలను క్లిక్ చేసి.. నెట్టింట వైరల్ చేయడం రీసెంట్ డేస్‌లో మరీ ఎక్కువైంది. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమాకు కూడా ఇదే జరిగింది.
సముద్రఖని డైరెక్షన్లో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ తేజ్ హీరోలుగా.. ఓ సినిమా తెరకెక్కుతోంది. కోలీవుడ్ సినిమా ‘వినోదయ సితం’ కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమా షూట్ ఇటీవల చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .
అయితే ఈ షూటింగ్ సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. దాంతో పాటే.. లీకర్స్ పై ఇండస్ట్రీ పీపుల్ విరుచుకు పడేలా చేస్తోంది. కష్టపడి తీస్తున్న సినిమాను .. ఇలా కిల్ చేయడం ఏంటనే ప్రశ్న వారి నుంచి నేరుగా వస్తోంది.
Pawan Kalyan




