Prabhas: ప్రభాస్ ఆ సినిమాకు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదా.?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే సలార్, కల్కి సినిమాలతో సాలిడ్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. సలార్సినిమాతో దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ హిట్ అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తో పటు నాగ్ అశ్విన్ తో కల్కితో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాలు చేస్తున్నాడు.

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. బాహుబలికి ముందు ఏడాదికి ఒక సినిమా అనే నిబంధన ఉండేది ప్రభాస్ కి. ఇప్పుడు ప్రభాస్ స్పీడ్ పెంచాడు. అయితే ఇప్పుడు డిమాండ్ పెరగడంతో ప్రభాస్ ఆ రూల్ ని బ్రేక్ చేసి ఏడాదికి రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. చివరిగా ప్రభాస్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. అలాగే ఈ ఏడాది మూడు సినిమాలు విడుదల కానున్నాయి.ప్రభాస్ ప్రస్తుతం ‘రాజా సాబ్’ షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్నాడు. దీని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ‘సీతా రామం’ ఫేమ్ రఘు హనుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా లాంచ్ మొన్నామధ్య జరిగింది, షూటింగ్ కూడా మొదలైంది. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ప్రభాస్ మరో కొత్త సినిమా స్టార్ట్ చేసేశాడు. ‘అర్జున్‌రెడ్డి’, ‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రంలో ప్రభాస్ నటించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కనుంది.
ఇదిలా ఉంటే ప్రభాస్ కన్నప్ప సినిమాలోనూ నటిస్తున్నాడు. కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే కన్నప్ప సినిమా నుంచి పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ముందుగా ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఓ స్పెషల్ రోల్ లో మాత్రమే కనిపిస్తారని తెలుస్తుంది. రీసెంట్ గా విడుదల చేసిన ప్రభాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే కన్నప్ప సినిమా కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలుస్తుంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తుంది. మంచు విష్ణు ఫ్యామిలీకి ప్రభాస్ కు మధ్య మంచి రిలేషన్ ఉంది. మంచు మోహన్ బాబును ప్రభాస్ బావ అని పిలుస్తుంటారు. ఈ ఇద్దరూ కలిసి బుజ్జిగాడు సినిమాలో నటించారు. ఈ రిలేషన్ తో ప్రభాస్ కన్నప్ప సినిమాలో నటించడానికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








