సినీ లవర్స్‌కు పండగే.. ప్రేమికుల రోజున ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలు ఇవే..
ఈ ప్రేమికుల దినోత్సవం రోజున థియేటర్స్ లో క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రేక్షకుల ముందుకు ఫిబ్రవరి 14న విడుదలకానుంది. అలాగే బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్రహ్మ ఆనందం సినిమా కూడా అదే రోజు విడుదల కానుంది.

రేపు దేశం మొత్తం ప్రేమికుల దినోత్సవం జరుపుకోనుంది. ఆ రోజు ప్రేమికులంతా తమ ప్రియమైన వారితో సరదా గడపనున్నారు. అంతే కాదు సినీ ప్రేమికులను అలరించడానికి కూడా కొత్త సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు మూడు క్రేజీ సినిమాలు రానున్నాయి. వాటిలో ముందుగా చెప్పాల్సింది విశ్వక్ సేన్ లైలా సినిమా గురించి. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ పూర్తయ్యింది. ఈ చిత్రం 136 నిమిషాల (రెండు గంటల 16 నిమిషాలు)నిడివితో వస్తోంది. ఈ సినిమా పై చిత్రయూనిట్ చాలా నమ్మకంతో ఉన్నారు.
ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడం ఖాయం అంటున్నారు విశ్వక్ సేన్. ఈ సినిమా ప్రేమికుల రోజున థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమాతో పాటు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్రహ్మ ఆనందం సినిమా కూడా ఫిబ్రవరి 14న విడుదలకానుంది. ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా ఫిబ్రవరి 14న న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక రష్మిక మందన్నా, విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం ఛవా. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. ఇన్నాళ్లు వేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ కూడా ఫిబ్రవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సాంబాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. వీటితో పాటు సిద్దు జొన్నల గడ్డ నటించిన కృష్ణ అండ్ హిస్ లీల సినిమా రీ రిలీజ్ అవుతుంది. ఇట్స్ కాంప్లికేటెడ్ పేరుతో రీ రిలీజ్ చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








