Kantara: దూసుకుపోతోన్న కాంతార.. దీపావళి కూడా కలిసి రావడంతో సినిమాకు కలెక్షన్ల సునామి..

కేవలం మన సినిమాలే కాదు ఇతర భాషల సినిమాలు కూడా తెలుగులో సూపర్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా కాంతార సినిమా క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంత కాదు.

Kantara: దూసుకుపోతోన్న కాంతార.. దీపావళి కూడా కలిసి రావడంతో సినిమాకు కలెక్షన్ల సునామి..
Kantara

Updated on: Oct 23, 2022 | 6:51 AM

ఇటీవల రిలీజ్ అవుతున్న సినిమాలు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు ఉదాహరణగా చాలా చిన్న సినిమాలుగా వచ్చి పెద్ద విజయాలను అందుకున్నాయి. కేవలం మన సినిమాలే కాదు ఇతర భాషల సినిమాలు కూడా తెలుగులో సూపర్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా కాంతార సినిమా క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంత కాదు. ఈ కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటు పలు భాషలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. భారీగా కలెక్షన్లు రాబట్టడమే కాదు..! మేకర్స్ అందరి చేత చప్పట్లు కొట్టిస్తుంది. కనుమరుగవుతున్న కన్నడ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల మరోసారి ప్రజలకు గుర్తు చేసే చిత్రం ఇది.

ఈ సినిమాలో భూత కోల ఆచారాన్ని చూపించారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన ప్రేక్షకుల మైండ్ లో నుంచి అంత ఈజీగా పోదు అనే చెప్పాలి. కన్నడలో ఇప్పటికే రికార్డ్ సృష్టించిన కాంతార ఇప్పుడు ఇతర భాషల్లోనూ సత్తా చాటుడుతుంది. ముఖ్యంగా ఈ సినిమా హిందీలో కలెక్షన్స్ వేగం పెంచింది. ఈ చిత్రాన్ని హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించగా.. తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేశారు.

దీపావళి కూడా ‘కాంతారా’ మూవీకి కలిసి రానుంది. ఈ వారాంతంలో ఈ సినిమా మరో 4 కోట్లు వసూల్ చేసే అవకాశం కనిపిస్తోంది.  శని ఆదివారాలు వసూళ్లు కలుపుకొని 4 నుంచి 7 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా కాంతార సినిమా పాన్ ఇండియా మూవీగా భారీ విజయాన్ని అందుకుంది.

ఇవి కూడా చదవండి