Veera Simha Reddy: వీరసింహ రెడ్డి సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్స్ ఇవేనట..

నటసింహం ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు టాక్ షోలతో దూసుకుపోతున్నారు. ఇక చివరిగా అఖండ సినిమాతో ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

Veera Simha Reddy: వీరసింహ రెడ్డి సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్స్ ఇవేనట..
Veera Simha Reddy
Follow us

|

Updated on: Oct 23, 2022 | 7:05 AM

బాలయ్య బాబు సినిమా అంటే క్రేజ్ మాములుగా ఉండదు. టైటిల్ దగ్గర నుంచి మొదలు పెడితే సినిమా సక్సెస్ మీట్ వరకు ఆ హవా.. ఆ క్రేజ్ కంటిన్యూ అవుతుంది. నటసింహం ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు టాక్ షోలతో దూసుకుపోతున్నారు. ఇక చివరిగా అఖండ సినిమాతో ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 200 కోట్లకు పైగా వసూల్ చేసి సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. క్రాక్ సినిమాతో రీసెంట్ గా హిట్ కొట్టిన గోపిచంద్ మలినేని ఇప్పుడు బాలయ్యను పవర్ ఫుల్ పాత్రలో చూపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు.

కర్నూల్ సిటీలో కొండారెడ్డి బురుజు సెంటర్లో బాలయ్య సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు వీర సింహారెడ్డి అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. మాస్ యాక్షన్ మూవీగా ఈ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు ముందుగా చాలా టైటిల్స్ అనుకున్నారట. అయితే ఆ టైటిల్ బాలయ్యను మెప్పించలేక పోయాయని అంటున్నారు. ముందుగా ఈ మూవీకి.. జై బాలయ్య, రెడ్డిగారు, అన్నగారు, పెద్దాయన టైటిల్స్ వినిపించాయి. చాలా టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినా ఆ టైటిల్స్ ను కాదని వీరసింహారెడ్డి టైటిల్ ను ఫిక్స్ చేశారు. కథకు తగ్గట్టుగా టైటిల్ ఉండాలని బాలయ్య భావించి ఈ సినిమాకు వీరసింహారెడ్డి అనే టైటిల్ ను ఓకే చేశారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

Latest Articles