చిక్కుల్లో అనుష్క శ‌ర్మ‌..కేసు పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే..!

బాలీవుడ్ హీరోయిన్, భార‌త క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య‌ అనుష్క శర్మపై బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్‌ గుర్జర్‌ ఇటీవల పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అనుష్క ప్రొడ్యూస్ చేసిన‌ వెబ్‌ సిరీస్‌ ‘పాతాళ్‌లోక్‌’ అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజైంది. ఇందులోని ఓ సీన్ లో నందకిశోర్‌ ఫొటోను తన ప‌ర్మిష‌న్ లేకుండానే ఉపయోగించారని అనుష్కపై కేసు పెట్టారు గుర్జర్‌. అంతేకాదు వెబ్‌ సిరీస్‌ను బ్యాన్ చెయ్యాల‌ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు లేఖ రాశారు […]

చిక్కుల్లో అనుష్క శ‌ర్మ‌..కేసు పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే..!
Follow us

|

Updated on: May 27, 2020 | 8:38 PM

బాలీవుడ్ హీరోయిన్, భార‌త క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య‌ అనుష్క శర్మపై బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్‌ గుర్జర్‌ ఇటీవల పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అనుష్క ప్రొడ్యూస్ చేసిన‌ వెబ్‌ సిరీస్‌ ‘పాతాళ్‌లోక్‌’ అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజైంది. ఇందులోని ఓ సీన్ లో నందకిశోర్‌ ఫొటోను తన ప‌ర్మిష‌న్ లేకుండానే ఉపయోగించారని అనుష్కపై కేసు పెట్టారు గుర్జర్‌.

అంతేకాదు వెబ్‌ సిరీస్‌ను బ్యాన్ చెయ్యాల‌ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు లేఖ రాశారు గుర్జర్. అనుష్క మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కారకుల‌య్యార‌ని.. ఆమెపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు ఫైల్ చెయ్యాల‌ని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. అనుష్క దేశద్రోహి అంటూ ఘాటైన వ్యాఖ్య‌లు చేవారు.

ఈ క్రమంలో నందకిశోర్‌ మీడియాతో మాట్లాడుతూ.. విరాట్‌ కోహ్లీ పేరును కూడా తెర‌పైకి తెచ్చారు . “విరాట్‌ కోహ్లీకి దేశం అంటే అపార‌మైన భ‌క్తి ఉంది. ఆయన ఇండియా‌ తరఫున ఆడుతున్నారు. ఆయన అనుష్కకు విడాకులు ఇవ్వాలి” అని అన్నారు. ‘పాతాళ్‌ లోక్‌’ సిరీస్‌పై ఇప్పటికే గోర్ఖా వర్గం వారు కూడా తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. ఓ సీన్ లో గోర్ఖా వర్గాన్ని కించపరిచే డైలాగ్స్ ఉన్నాయంటూ ఆల్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ గోర్ఖా యూత్‌ అసోసియేషన్‌(ఆప్‌గ్యా) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ సంఘం శాఖాధ్యక్షుడు బికాష్‌ భట్టారై.. అనుష్కపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు కంప్లైంట్ చేశారు.

పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.