ఎవుర్రా నువ్వు ఇలా ఉన్నావ్.. ఊర్వశికి ఊహించని షాక్ ఇచ్చాడు.. నెటిజన్స్ ఏమంటున్నారంటే
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కు మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్. తన అందంతో కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది. ఇక ఈ అమ్మడు సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు నట్టింట విపరీతమైన క్రేజ్ ఉంది.

ఊర్వశి రౌతేలా పేరు ఇప్పుడు టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ లో కూడా తెగ హడావిడి చేస్తుంది. స్పెషల్ సాంగ్ కు ఈ చిన్నది కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి. తన అందాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ తో దూసుకుపోతుంది. రీసెంట్ గా నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాలో చిన్న పాత్రతో పాటు స్పెషల్ సాంగ్ కూడా చేసింది. ఇక ఈ సినిమాలో దబిడి దబిడి సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ ను సినిమావాళ్ళ కంటే ఉర్వశిని ఎక్కువ గా ప్రమోట్ చేసింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
అలాగే రీల్స్ లోనూ దుమ్మురేపారు. ఇన్ స్టా గ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఈ సాంగే మారుమ్రోగిపోతుంది. ఎక్కడ చూసిన ఊర్వశి రౌతేలా దబిడి దబిడి సాంగ్ కు రీల్స్ చేస్తూ తెగ సందడి చేస్తుంది. రీసెంట్ గా ఊర్వశి ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ కు వెళ్ళింది ఈ బ్యూటీ. అక్కడ కూడా ఈ చిన్నది దబిడిదబిడి సాంగ్ కు రీల్ చేసి సందడి చేసింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఊర్వశి డాన్స్ చేస్తుంటే సడన్ గ ఒక వ్యక్తి ఉర్వశిని ముద్దుపెట్టుకున్నాడు.
ఆ వ్యక్తి ఎవరో కాదు ఓరి.. ఇతని పేరు ఈమధ్య ఎక్కువగానే వినిపించింది. ఓరి బాలీవుడ్ మోడల్.. ఏ ఎంతోమంది సెలబ్రెటీ ఫ్రెండ్స్ ఉన్న ఓరి.. సెలబ్రెటీలతో ఫోటోలు దిగుతూ సందడి చేస్తాడు. ఓరి స్టైల్ అంటూ సెలబ్రెటీలతో వెరైటీగా ఫోటోలకు ఫోజులిస్తూ వైరల్ అయ్యాడు. తాజాగా ఊర్వశితో కలిసి క్రికెట్ స్టేడియం లో దబిడి దబిడి సాంగ్ కు స్టెప్పులేశాడు. డాన్స్ చేస్తూ చేస్తూ సడన్ గా ఉర్వశిని ముద్దుపెట్టుకున్నాడు. ఈవీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఎవుర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




