Tollywood : భారత క్రికెట్లో ఆల్ రౌండర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఫేమస్.. ఒక్కో సినిమా బ్లాక్ బస్టర్..
భారతీయ సినిమా ప్రపంచంలో ఇప్పుడు పాపులర్ అయిన నటీనటులు ఒకప్పుడు వేరే రంగాల్లో స్థిరపడినవారే. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే భారతీయ సినిమాలో ఏకంగా 9 జాతీయ అవార్డులు గెలుచుకున్న ఈ సెలబ్రెటీ క్రికెట్ లో ఆల్ రౌండర్. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాపులర్ అయ్యారు. ఇంతకీ ఆతడు ఎంవరంటే..

భారతీయ సినిమా పరిశ్రమకు, క్రికెట్ కు విడదీయరాని అనుబంధం ఉంది. ఇప్పటికే చాలా మంది సినీప్రముఖులు క్రికెటర్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే కొందరు క్రికెటర్లతో మంచి అనుబంధాన్ని ఏర్పర్చుకున్నారు. కొంతమంది క్రికెటర్స్ సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు. హీరోలుగా, సహయ నటులుగా కనిపించారు. కానీ మీకు తెలుసా.. ఈ సెలబ్రెటీ ఒకప్పుడు క్రికెట్ లో ఆల్ రౌండర్. సినిమాల్లోకి అడుగుపెట్టి ఇప్పటివరకు 9 జాతీయ అవార్డులను గెలుచుకున్నాడు. ఆయనే విశాల్ భరద్వాజ్. హిందీ సినీప్రపంచంలో అత్యుత్తమ దర్శకులలో ఒకరు. దర్శకుడిగానే కాకుండా సంగీత స్వరకర్త. స్క్రీన్ రైటర్. ప్లేబ్యాక్ సింగర్. నిర్మాత. ఇలా ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారు.
ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇప్పటివరకు 9 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. వాటిలో 3 ఉత్తమ సంగీతానికి.. 2 ఉత్తమ స్క్రీన్ ప్లేకు సంపాదించుకున్నారు. కానీ ఆయన పాపులర్ క్రికెటర్ అని చాలా మందికి తెలియదు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలోని చాంద్‌పూర్‌లో జన్మించిన ఆయన తండ్రి రామ్ భరద్వాజ్ హిందీ చిత్రాలకు కవి మరియు గేయ రచయిత. తన తండ్రి అడుగుజాడలను అనుసరించి, విశాల్ భరద్వాజ్ సంగీత స్వరకర్తగా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. 1995లో విడుదలైన పిల్లల చిత్రం ‘అభయ్’తో ఆయన సంగీత స్వరకర్తగా అరంగేట్రం చేశారు. 1996లో విడుదలైన ‘గుల్జార్స్ మ్యాచ్స్’ చిత్రం అతని కెరీర్ మలుపు తిప్పింది. ఈ చిత్రానికి అతను ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత మక్దీ సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేశారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..
చిత్ర పరిశ్రమలోకి రావడానికి ముందు మీరట్‌లో నివసించిన అతడు ఉత్తరప్రదేశ్‌లోని U19 జట్టు తరపున క్రికెట్ ఆడాడు. అప్పుడు ఆయన ఆల్ రౌండర్. ఫాస్ట్ బౌలర్, బ్యాట్స్ మెన్. అతని ఆట సామర్థ్యాన్ని తెలుసుకున్న అప్పటి జాతీయ క్రికెట్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఒకసారి “సంగీత స్వరకర్తగా విశాల్ భరద్వాజ్ నిష్క్రమణ భారత క్రికెట్‌కు పెద్ద నష్టం” అని అన్నారు. అంతర్ విశ్వవిద్యాలయ మ్యాచ్ కు ఒక రోజు ముందు ప్రాక్టీస్ సెషన్ లో విశాల్ బొటనవేలు విరిగింది. ఈ ప్రమాదం అతని క్రికెట్ కలలను తుడిచిపెట్టింది. అదే సంవత్సరం అతని తండ్రి మరణం అతను తన క్రికెట్ కెరీర్ ను కొనసాగించలేకపోవడానికి ఒక ప్రధాన కారణం. లేదంటే అతడు కచ్చితంగా ఇండియా క్రికెట్ టీంలో ఉండేవాడు. ఇప్పుడు సినీరంగంలోనూ సక్సెస్ అయ్యాడు.
ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‌ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..
View this post on Instagram
ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‌కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‌తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..
