Priyanka Mohan: ప్రియాంకకు స్పెషల్ విషెస్ తెలిపిన ఓజీ, సరిపోదా శనివారం టీమ్

గ్యాంగ్ లీడర్ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ఆ తర్వాత మరో యంగ్ హీరో శర్వానంద్ సరసన శ్రీకారం సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ప్రియాంకాకు తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. దాంతో తమిళ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది. అక్కడ వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకుపోతోంది.

Priyanka Mohan: ప్రియాంకకు స్పెషల్ విషెస్ తెలిపిన ఓజీ, సరిపోదా శనివారం టీమ్
Priyanka
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 20, 2023 | 2:01 PM

నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ప్రియాంక అరుళ్ మోహన్. తొలి సినిమాతోనే ఈ చెన్నై బ్యూటీ ప్రేక్షకులను ప్రేమలో పడేసింది. క్యూట్ లుక్స్ తో చూడచక్కని రూపంతో కవ్వించింది. గ్యాంగ్ లీడర్ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ఆ తర్వాత మరో యంగ్ హీరో శర్వానంద్ సరసన శ్రీకారం సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ప్రియాంకాకు తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. దాంతో తమిళ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది. అక్కడ వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం తమిళ్ లో బిజీ హీరోయిన్ గా ఉన్న ప్రియాంక ఇప్పుడు రెండు టాలీవుడ్ సినిమాలను ఒకే చేసింది. ఆ రెండు కూడా క్రేజీ ప్రాజెక్ట్స్.

ప్రియాంక ఓకే చేసిన సినిమాల్లో ఒకటి నాని నటిస్తున్న సరిపోదా శనివారం. నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న సినిమా సరిపోదా శనివారం. గతంలో నాని, వివేక్ కాంబినేషన్ లో అంటే సుందరానికి అనే సినిమా వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది . దాంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని కసి మీద ఉన్నారు.

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలో నటిస్తుంది ప్రియాంక. పవర్ స్టార్ , డైరెక్షర్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా లో ప్రియంక పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది. తాజాగా ప్రియాంక మోహన్ పుట్టిన రోజు సందర్భంగా సరిపోదా శనివారం , ఓజీ సినిమాలనుంచి ప్రియాంక లుక్ ను రిలీజ్ చేసి ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు మేకర్స్. ఆ లుక్ పై మీరూ ఓ లుక్కేయండి.

ప్రియాంక మోహన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..