OG Movie: ‘ఓజీ’ నటీనటుల రెమ్యునరేషన్స్.. పవన్ కల్యాణ్, ప్రియాంక, ఇమ్రాన్ హష్మీ ఎవరెవరు ఎంత తీసుకున్నారంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ. అన్ని హంగులు పూర్తి చేసుకున్నఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతోంది. సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో భారీ తారాగణమే ఉంది. మరి వారి పారితోషికాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా గురువారం (సెప్టెంబర్ 25) నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఇందుకోసం బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడనున్నాయి. సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్ తో పాటు పలువురు స్టార్స్ నటిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక కాగా, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే సీనియర్ నటి శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, శుభలేక సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, వెంకట్ ఇలా స్టారాది స్టార్స్ ఈ సినిమాలో వివిధ పాత్రలు పోషించనున్నారు. అలాగే డీజీ టిల్లు బ్యూటీ నేహా శెట్టి ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ఓజీ నటుల రెమ్యునరేషన్లపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఓజీ సినిమాకు మెయిన్ పిల్లర్ పవన్ కల్యాణే. కాబట్టి తన క్రేజ్ దృష్ట్యా ఆయన రూ. 100 కోట్ల వరకు పారితోషికం తీసుకన్నట్లు తెలుస్తోంది. అలాగే డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి 6 నుంచి 8 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్లు టాక్. ఇక హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ కు రూ. 2 కోట్లు, విలన్ రోల్ లో కనిపించిన బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీకి రూ. 5 కోట్లు అందుకున్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియాలో పవన్ ఫ్యాన్స్ హంగామా..
Melbourne fans ❤️❤️
Firestorm uu lanti rage uu……#OG#TheyCallHimOG
— DVV Entertainment (@DVVMovies) September 22, 2025
ఇక సత్యదాదా గా కనిపించనున్న ప్రకాష్ రాజ్ 1.5 కోట్లు, శ్రియా రెడ్డి 40 లక్షలు, అర్జున్ దాస్ 40 లక్షల తీసుకున్నట్లు సమాచారం. అందుకుంటున్నారట.అలాగే సంగీత దర్శకుడు తమన్ 5 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. మిగతా నటీనటులు, టెక్నీ షియన్లకు కూడా భారీగానే రెమ్యునరేషన్ అందినట్లు సమాచారం. ఓవరాల్ గా సినిమా మేకింగ్ బడ్జెట్ 250 కోట్ల వరకు అయినట్లు తెలుస్తోంది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఓజీ మూవీ 50 కోట్ల గ్రాస్ వసులు చేసినట్లు తెలుస్తోంది.
సాయి ధరమ్ తేజ్ ట్వీట్..
The BENGAL TIGER we were missing is back on the hunt. Thanks, @Sujeethsign, for fulfilling every Powerstar fan’s desire – including mine. A brilliant and blood-soaked cut. Nanba @MusicThaman, what a score that was… Firestorm!
And My hero, my GURU garu @PawanKalyan mama is… pic.twitter.com/IlS0N4k3d3
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 22, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








