NTR Birthday: ఎన్టీఆర్ ఆస్తుల విలువ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి.. ఆయన గ్యారేజీలో ఉన్నలగ్జరీ కార్లు ఇవే
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ఇండియాలోనే అపారమైన ప్రతిభ ఉన్న నటుడు. ఆయన డైలాగ్ డిక్షన్, భాషా ప్రావీణ్యం, డ్యాన్స్.. ఇలా అన్నీ అమితమైన అభిమానుల్ని సంపాదించుకునేలా చేశాయి. ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఎన్టీఆర్ స్థాయి ప్రపంచానికి తెలిసింది. వివిధ దేశాల్లో తారక్‌కి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు తారక్ కు విషెస్ తెలుపుతున్నారు. ఎన్టీఆర్ క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ ముందువరకు టాలీవుడ్ లో టాప్ హీరో తారక్, రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రపంచ వ్యాప్తంగా తారక్ అభిమానులు డబుల్ అయ్యారు. విదేశాల్లోనూ ఎన్టీఆర్ పేరు చెప్తే పూనకాలు వచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్ లో తారక్ అంటే పడిచచ్చిపోతారు అభిమానులు. ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అలాగే దేవర సినిమా కూడా జపాన్ లో విడుదలైంది.
ఇక నేడు తారక్ పుట్టిన రోజు గిఫ్ట్ గా ఆయన నటిస్తున్న వార్ 2 సినిమా నుంచి టీజర్ విడుదలై సంచలనం సృష్టిస్తుంది. ఇదిలా ఉంటే తారక్ నెట్ వర్త్ గురించి సోషల్ మీడియాలో చర్చజరుగుతుంది. ఎన్టీఆర్ ఆస్తుల విలువ ఎంతో ఒక్కసారి చూద్దాం.! ఎన్టీఆర్ ఆస్తి విలువ సుమారు రూ. 500కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ కు హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇంటిలో నివసిస్తున్నారు. ఈ ఇల్లు ఆధునిక సౌకర్యాలతో కూడిన అత్యంత ఖరీదైన ఆస్తుల్లో ఒకటి.
అలాగే ఎన్టీఆర్ కు కార్స్ అంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజీలో ఉన్న కొన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిలో పోర్సే 911 (సుమారు రూ.1.5 కోట్లు), రేంజ్ రోవర్( సుమారు రూ.2.5 కోట్లు), మెర్సిడెస్ బెంజ్ GLE 350d 4మ్యాటిక్ (సుమారు రూ.1.5 కోట్లు), అలాగే తారక్ కు వాచ్ లంటే కూడా చాలా ఇష్టం రూ. 1 కోటి విలువైన లగ్జరీ వాచీలు ఆయన దగ్గర చాలానే ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు సుమారు 30-50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. వీటితోపాటు పలు బ్యాండ్స్ ను కూడా ప్రమోట్ చేస్తున్నారు తారక్. ఇలా తారక్ ఆస్తిపాస్తుల విలువ సుమారు రూ. 500కోట్ల వరకు ఉంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
