AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Natu Natu Song: సింకింగ్ విషయంలోనే సల్సాను మించి… చించి పడేసిన నాటు నాటు

మత్తుగా మంద్రంగా సాగే సల్సా డ్యాన్సెక్కడ... పచ్చిమిరప లాగా నిలువెల్లా ఘాటెక్కించే మన నాటుపాటెక్కడ? వెస్టర్న్ డ్యాన్స్ థీముల్ని సైతం వెనక్కు నెట్టేసిన నాటు పాటకు, సల్సా డ్యాన్సుకీ పోటీ పెడితే...? ఓడేదెవరో తన సినిమాలో చూపించేశారు జక్కన్న.

Natu Natu Song: సింకింగ్ విషయంలోనే సల్సాను మించి... చించి పడేసిన నాటు నాటు
Ram Charan - NT Rama Rao
Ram Naramaneni
|

Updated on: Mar 12, 2023 | 3:14 PM

Share

మీ సల్సాలు, మీ ఫ్లెమెంకోలు మడిచి పక్కనపెట్టండి.. మా నాటు పాట చూస్తారా అంటూ మన రాముడు-భీముడు ఇచ్చిపడేసిన ఆ ఛాలెంజింగ్ పెర్ఫామెన్స్.. ఇప్పుడు టోటల్‌ ప్రపంచాన్నే ఊపేస్తోంది. గ్లోబులో ఏ మూల చూసినా నాటునాటు పాటే దంచికొడుతోంది. కిర్రు సెప్పులేసుకుని కర్రసాము చేసినట్టు మనోళ్లు చేసిన ఆ వీరనాటు- ఊరనాటు పెర్ఫామెన్స్‌కి సల్సాలు, ఫ్లెమెంకోలు క్లీన్‌ బౌల్డయ్యాయి. ఇటు మన తెలుగు సినిమాను ఆస్కార్ దాకా తీసుకెళ్లింది నాటు పాట.

వాటీజ్ నాటు అని ఆ పాటలో ఆ బ్రిటీషోడు మనోళ్ల చేత అడిగి వేయించుకుంటే… ఇప్పుడు వాటీజ్ సల్సా అంటూ ఆ వెస్ట్రర్న్ మూమెంట్‌ వైపు ఆసక్తిగా చూస్తున్నారు మనోళ్లు. 60 ఏళ్ల కిందట న్యూయార్క్‌లో పుట్టింది సల్సా డ్యాన్స్ థీమ్. అక్కడి బార్లు, రెస్టారెంట్లూ, బాల్‌రూముల్లో సల్సా నృత్యం ఒక ఆనవాయితీ. ఫిమేల్ అండ్ మేల్… ఇద్దరు మనుషులు కలిసి చేసే సల్సా డ్యాన్స్‌లో కూడా సింక్రనైజేషనే కీలకం. ఆ సింకింగ్ విషయంలోనే సల్సాను మించి… చించి పడేసింది మన నాటు పాట. ఒంటికాలితో ఆస్కార్‌ దాకా నడిచెళ్లి… డ్యాన్స్ సొసైటీ మొత్తాన్ని ఫిదా చేస్తోంది నాటు బీటు.

సల్సాతో పోలిస్తే… నాటు పాటకుండే వ్యాల్యూ అడిషన్స్ ఏంటి… సల్సాను నిలబబెట్టి ఓడగొట్టిన నాటు పాటలో ఉండే సూపర్ స్పెషాలిటీస్ ఏంటి? అంటే… ఎక్స్‌ట్రా జాయ్ అండ్ ఎక్స్‌ట్రా జోష్ అంటారు సగటు డ్యాన్స్ మాస్టర్లు. వరల్డ్ వైడ్‌ దుమ్ము దులిపేస్తూ…. దిస్సీజ్ అవర్ సాంగ్… అనిపిస్తున్న అచ్చతెలుగు పాట నాటు పాట. సల్సాలో కూడా కనిపించని ఎలిమెంట్స్.. నాటు పాటలో ఉండడం వల్లే ఆస్కార్‌ దాకా పరుగెత్తించింది… ఇంగ్లీషోళ్లను కూడా కట్టిపడేసింది. మన నాటు షాటుకు సల్సాలూ గిల్సాలూ అన్నీ ఔటే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us