Indian 2: శంకర్ కు వర్సెస్ లైకా ప్రొడక్షన్స్.. ఇండియన్ 2 ఉన్నట్టా .. లేనట్టా…?
ఇండియన్ 2 సినిమా పెండింగ్ వర్క్ అంతా ఒక్క నెలలో కంప్లీట్ చేయాలి.. ఇది దర్శకుడు శంకర్‌కు ప్రొడక్షన్ హౌస్ లైకా పెట్టిన కండిషన్.

Indian 2:
ఇండియన్ 2 సినిమా పెండింగ్ వర్క్ అంతా ఒక్క నెలలో కంప్లీట్ చేయాలి.. ఇది దర్శకుడు శంకర్‌కు ప్రొడక్షన్ హౌస్ లైకా పెట్టిన కండిషన్. ఈ విషయం మీదే కోర్టుకు కూడా వెళ్లింది లైకా. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యమైందన్న నిర్మాతలు.. ఎట్టి పరిస్థితుల్లో సినిమా జూన్‌లో పూర్తి చేయాలని పట్టుబడుతున్నారు.
అయితే ఈ విషయంలో శంకర్ వర్షన్ మాత్రం మరోలా ఉంది. ఇంత భారీ చిత్రాన్ని ఒక్క నెలలో పూర్తి చేయటం కష్టం అంటున్నారు. జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో షూటింగ్ పూర్తి చేస్తానని చెబుతున్నారు. అంతేకాదు కామెడియన్ వివేక్ మరణంతో కొన్ని సీన్స్ రీ షూట్ చేయాల్సి ఉందని.. కాబట్టి నెల రోజుల టైం అస్సలు సరిపోదంటున్నారు డైరెక్టర్.
ఇండియన్ 2 ఏ ముహూర్తనా స్టార్ట్ అయ్యిందో గానీ… ఫస్ట్ నుంచి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. బడ్జెట్ విషయంలో మొదలైన వివాదాలు … తరువాత సెట్‌లో యాక్సిడెంట్‌తో తారా స్థాయికి చేరాయి.. డైరెక్టర్ శంకర్ కూడా కొంతకాలంగా సినిమాకు దూరంగా ఉంటూ కొత్త సినిమాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ రెండు సినిమాలను ప్రకటించాడు. కానీ ఇంతలో ముగిసింది అనుకున్న భారతీయుడు సీక్వల్ వివాదం కోర్టు వరకు వెళ్ళింది. ప్రస్తుతం శంకర్ కు అటు లైకా ప్రొడక్షన్స్ వారికీ హోరాహోరి పోరు జరుగుతుంది. ఇప్పుడు శంకర్ మరో సినిమా అనౌన్స్ చేయటంతో.. సీన్ శంకర్ వర్సెస్ లైకా అన్నట్టుగా మారింది. మరీ ఈ వివాదానికి ఎప్పటికి తెర పడుతుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :