Tollywood : ఉగాదికి స్టార్ హీరోల సినిమా నుంచి నో అప్డేట్స్.. హర్ట్ అయిన ఫ్యాన్స్

ఉగాది పండగకు కూడా చాలా సినిమాలనుంచి అప్డేట్స్ వచ్చాయి. చిన్న సినిమాలనుంచి పెద్ద సినిమాల వరకు పోస్టర్స్ అని టైటిల్స్ అని ఎదో ఒకటి రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు హీరోలు, మేకర్స్.

Tollywood : ఉగాదికి స్టార్ హీరోల సినిమా నుంచి నో అప్డేట్స్.. హర్ట్ అయిన ఫ్యాన్స్
Tollywood
Follow us

|

Updated on: Mar 24, 2023 | 2:58 PM

పండగలు వచ్చాయంటే చాలు తమ నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ఎదో ఒక అప్డేట్ తో అభిమానులను అలరిస్తూ ఉంటారు హీరోలు. అలాగే ఉగాది పండగకు కూడా చాలా సినిమాలనుంచి అప్డేట్స్ వచ్చాయి. చిన్న సినిమాలనుంచి పెద్ద సినిమాల వరకు పోస్టర్స్ అని టైటిల్స్ అని ఎదో ఒకటి రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు హీరోలు, మేకర్స్. అయితే కొంతమంది స్టార్ హీరోలు మాత్రం తమ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ కూడా ఇవ్వలేదు దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. ఇంతకు తమ సినిమా అప్డేట్స్ ఇవ్వని హీరోలు ఎవరంటే.. అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.

ముఖ్యంగా ఈ నలుగురి ఫ్యాన్స్ కాస్త ఎక్కువగానే హర్ట్ అయ్యారు. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పవర్ స్టార్ ఓ వైపు సినిమాలతో  పాటు రాజకీయాలతోనూ బిజీగా ఉన్నారు. కాగా వరుస సినిమాలను లైనప్ చేసి ఆయా సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటిలో క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు. అలాగే సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సిత్తం సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు పవన్. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలనుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు ఉగాదికి.

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమానుంచి కూడా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వలో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమానుంచి కూడా నో అప్డేట్. వీటితో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 సినిమానుంచి కూడా ఎలాంటి అప్డేట్ రాలేదు. దాంతో ఈ నలుగురు హీరోల ఫ్యాన్స్ కాస్త హార్ట్ అయ్యారు.