Vishnu Manchu: మనోజ్‌ వీడియోపై స్పందించిన విష్ణు.. గొడవను అతను ఆపలేకపోయాడంటూ..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Mar 24, 2023 | 2:29 PM

తాజాగా విష్ణు సారధి అనే వ్యక్తి ఇంటికి వెళ్లి గొడవ పడ్డారు. గతకొంత కాలం మనోజ్, విష్ణు మధ్య వివాదం నడుస్తోంది. ఈ ఇద్దరు కలిసి బయట పెద్దగా కనిపించడం లేదు.

Vishnu Manchu: మనోజ్‌ వీడియోపై స్పందించిన విష్ణు.. గొడవను అతను ఆపలేకపోయాడంటూ..
Manchu Vishnu, Manoj
Follow us

మంచు ఫ్యామిలీ గొడవ రచ్చకెక్కింది. చిన్న గొడవే అయినా .. ఇప్పుడు అది చిలికి చిలికి గాలివానగా మారింది. తాజాగా విష్ణు సారధి అనే వ్యక్తి ఇంటికి వెళ్లి గొడవ పడ్డారు. గతకొంత కాలం మనోజ్, విష్ణు మధ్య వివాదం నడుస్తోంది. ఈ ఇద్దరు కలిసి బయట పెద్దగా కనిపించడం లేదు. మొన్న జరిగిన మనోజ్ పెళ్ళికి కూడా విష్ణు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. తాజాగా విష్ణు ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారని.. తన బంధువులను కొడుతున్నడని ఓ వీడియోను షేర్ చేశారు మనోజ్. దాంతో వీరిద్దరి మధ్య గొడవ రోడ్డున పడింది. తాజాగా ఈ వివాదం పై విష్ణు స్పందించారు. విష్ణు మాట్లాడుతూ..

మా ఇద్దరి మధ్య సాధారణ గొడవే అన్నారు విష్ణు. నిన్న ఉదయం జరిగిన చిన్న సంఘటన ఇది. సారథితో నా వాగ్వాదాన్ని మనోజ్ ఆపలేకపోయాడు, వీడియో తీశాడు. మనోజ్ చిన్నవాడు, ఇది స్పందించాల్సినంత పెద్ద విషయం కాదు ఇది అని విష్ణు అన్నాడు.

అలాగే టీవీ9తో లక్ష్మీ మంచు మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. మనోజ్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ గురించి తనకు తెలియదు అన్నారు. అలాగే ఎలాంటి వీడియోను తాను చూడలేదని అన్నారు. వివాదం గురించి విష్ణు, మనోజ్‌తో నేను మాట్లాడలేదు. ప్రస్తుతం బంధువులతో బిజిగా ఉన్నాను, విషయం తెలిశాక  దీని పై మాట్లాడుతాను అని మంచు లక్ష్మీ అన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu