AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithya Menen: నా నటన మామూలుగానే ఉంది..కానీ.. జాతీయ అవార్డు రావడం పై నిత్యామీనన్

ఈ సినిమా తెలుగులో తిరు అనే టైటిల్‌తో రిలీజ్ అయ్యింది. ఉత్తమ నటిగా నిత్యా మీనన్‌కు జాతీయ అవార్డు ప్రకటించారు. ఈ క్రమంలో తిరు సినిమా గురించి నటి నిత్యా మీనన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దర్శకుడు మిత్రన్ ఆర్. జవహర్‌లాల్ నెహ్రూ దర్శకత్వం వహించిన తిరుచిత్రంబలం 2022లో థియేటర్లలో విడుదలైంది.

Nithya Menen: నా నటన మామూలుగానే ఉంది..కానీ.. జాతీయ అవార్డు రావడం పై నిత్యామీనన్
Nithya Menon
Rajeev Rayala
|

Updated on: Aug 19, 2024 | 7:05 PM

Share

రీసెంట్‌గా 2022 సంవత్సరానికి సంబంధించిన అవార్డులను ప్రకటించారు. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఈ అవార్డుల్లో తిరుచిత్రంబలం అనే సినిమాకు అవార్డ్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగులో తిరు అనే టైటిల్‌తో రిలీజ్ అయ్యింది. ఉత్తమ నటిగా నిత్యా మీనన్‌కు జాతీయ అవార్డు ప్రకటించారు. ఈ క్రమంలో తిరు సినిమా గురించి నటి నిత్యా మీనన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దర్శకుడు మిత్రన్ ఆర్. జవహర్‌లాల్ నెహ్రూ దర్శకత్వం వహించిన తిరుచిత్రంబలం 2022లో థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో ధనుష్, నిత్యా మీనన్, ప్రకాష్ రాజ్, భారతీరాజా, రాశి ఖన్నా, ప్రియా భవానీ శంకర్ తదితరులు నటించారు.

ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ఇది 2022లో  విడుదలైన సినిమాల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచింది. తిరుచిత్రంబలం సినిమాలో పాటలు పెద్ద హిట్ అయ్యాయి. మేఘం కరిగేనా.. సాంగ్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకు  చాలా మంది రీల్స్ చేసి వైరల్ చేశారు. ధనుష్- అనిరుధ్ కాంబో సూపర్ హిట్ కాంబో. ఈ సినిమాలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.

కేంద్ర ప్రభుత్వం 16వ తేదీన ప్రకటించిన జాతీయ అవార్డు జాబితాలో తిరుచిత్రంబలం చిత్రానికి 2 అవార్డులు వచ్చాయి. ఈ చిత్రంలో నటించిన నటి నిత్యా మీనన్‌కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును ప్రకటించారు. అలాగే ఈ చిత్రంలోని ‘మేఘం కరిగేనా’ అనే పాటకు కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్, సతీష్‌లకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు లభించింది. తనకు జాతీయ అవార్డు రావడం పై నిత్యా మీనన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ సినిమా గురించి ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ పోస్ట్‌లో ‘‘తిరుచిత్రంబలం సినిమాలో నా నటన మామూలుగానే ఉంది. అయితే దీని వెనుక ఉన్న కృషిని అర్థం చేసుకున్నందుకు సెలెక్టర్లకు ధన్యవాదాలు. గొప్ప నటన అంటే బరువు తగ్గడం లేదా పెరగడం లేదా శరీరాన్ని కృత్రిమంగా మార్చడం కాదు. అదంతా నటనలో భాగమే అని ఆమె రాసుకొచ్చింది. అలాగే ఈ అవార్డు భారతీరాజా, ప్రకాష్‌రాజ్, ధనుష్ అనే నలుగురికి. ఎందుకంటే నటుడికి ఉన్నంత ప్రాధాన్యత ఉన్న సినిమాలో నేను ఎప్పుడూ నటించలేదు. నిజం కంటే పుకార్లు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ముందుకు సాగడం కష్టం అని రాసుకొచ్చింది నిత్యామీనన్.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us