నితిన్-చంద్రశేఖర్‌ యేలేటి మూవీకి ఇంట్రస్టింగ్ టైటిల్

యంగ్ హీరో నితిన్ మంచి జోరుమీదున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న 'రంగ్‌దే' షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది.

  • Ram Naramaneni
  • Publish Date - 5:40 pm, Thu, 1 October 20
నితిన్-చంద్రశేఖర్‌ యేలేటి మూవీకి ఇంట్రస్టింగ్ టైటిల్

యంగ్ హీరో నితిన్ మంచి జోరుమీదున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న ‘రంగ్‌దే’ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. ఇక సెన్సుబుల్ చిత్రాల దర్శకుడు  చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో నితిన్‌ ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్‌-టైటిల్‌ను స్టార్‌ డైరెక్టర్  కొరటాల శివ రిలీజ్ చేశారు.

ఈ చిత్రానికి ‘చెక్‌’ అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. ప్రీలుక్‌లో నితిన్‌ చేతికి సంకెళ్లు ఉండగా, టేబుల్‌పై చదరంగం పావులు, కంచె ఉన్నాయి. మరి ఈ చదరంగం గేమ్ లో ఎవరు ఎలాంటి పావులు కదిపారు? ఎవరు చెక్‌మేట్‌ చెప్పారు? వంటి విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read :

దేశంలో కరోనా కలవరం

శీతాకాలంలో కరోనా ముప్పు మరింత అధికమట !